BigTV English

Kangana Ranaut on Bollywood: ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్‌కు గుడ్ బై: కంగనా రనౌత్

Kangana Ranaut on Bollywood: ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్‌కు గుడ్ బై: కంగనా రనౌత్

Kangana Ranaut Quits Movies: ప్రముఖ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే ఆమె ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఎన్నికల్లో మీరు ఎంపీగా గెలిస్తే సినిమాలకు దూరంగా ఉంటారా ? అని ప్రశ్నించగా అవును అని సమాధానం ఇచ్చారు.


బాలీవుడ్ లో నేను విజయం సాధించా..నటిగా ఎన్నో అవార్డులు గెలుచుకున్నా..మండి ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్ కు వీడ్కోలు పలకాలని అనుకుంటున్నా అని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఉత్తమ ఎంపీగా ప్రజలకు తన సేవలను అందిస్తానని చెప్పారు. అదే తనకు గొప్ప అవార్డుగా భావిస్తానని అన్నారు. మీరొక ప్రతిభావంతమైన నటి మీరు సినిమాలకు దూరంగా ఉండొద్దు అంటూ నిర్మాతలు, ప్రముఖ నటులు కోరుతున్నట్లు కంగనా తెలిపారు.

కానీ అంతకు ముందు ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భిన్నంగా స్పందించారు. ఎన్నికలకు ముందు నేను సంతకం చేసిన కొన్ని సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి.. ఈ కారణంతో వెంటనే బాలీవుడ్ ను విడిచి పెట్టలేను అని తెలిపారు. ఈ ఎన్నికలను కంగనా చాలా సీరియస్ గా తీసుకున్నారు.


Also Read: రేపే ఐదో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. బరిలో ప్రముఖ నేతలు

కంగనా రనౌత్ లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి పోటీ పడ్డారు. ఎన్నికల కారణంగా ఆమె నటిస్తున్న ఎమర్జెన్సీ సినిమా వాయిదా పడింది. ఎన్నికల సమయంలో ఆమె బిజీగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా కంగనా స్వీయ దర్శకత్వంలో రూపొందుతోంది.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×