NTR’s Devara First Single Review: మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఫియర్ సాంగ్ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
దేవర క్యారెక్టర్ కు అద్దంపట్టే లిరిక్స్.. అగ్గంటుకుంది సంద్రం భగ్గున మండె ఆకసం.. దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముంగిట నువ్వెంత.. ఇలాప్రతిదీ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ లను అయితే ఇచ్చి పడేశాడు అనిరుద్. అంత బావుంది కానీ, వీడియో మొత్తంలో అనిరుధ్ మాత్రమే ఎక్కువ కనిపించాడు. ఎన్టీఆర్ విజువల్స్ చాలా తక్కువ కనిపించాయి. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ కి ఇచ్చిన ఎలివేషన్స్ కన్నా అనిరుద్ కు ఇచ్చిన ఎలివేషన్స్ ఎక్కువ.
అసలు ఈ సాంగ్ లో హీరో అనిరుధ్ నా.. ? ఎన్టీఆర్ నా.. ? అన్నట్లు అనిపిస్తుంది అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో మేకర్స్ ను కూడా ఏమి అనలేం. మొదటి నుంచి కూడా అనిరుధ్ మ్యూజిక్ అంటే.. కచ్చితంగా అతనే మ్యూజిక్ వీడియోలో కనిపిస్తాడు. అది టైటిల్ సాంగ్ కు మాత్రమే. అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్ సినిమాలకు కూడా అనిరుధ్ ఇదే విధంగా సాంగ్స్ చేశాడు. కానీ, ఈసారి మాత్రం మనోడు హైప్ ఎక్కువ ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Also Read: Mirai Manchu Manoj: అన్నా.. ఏంటన్నా ఆ ఫైట్స్.. ఏమన్నా ఉందా గ్లింప్స్.. గూస్ బంప్స్ వచ్చాయ్
సాంగ్, మ్యూజిక్ బావుండడంతో ఎన్టీఆర్ ఫాన్స్ కూడా దీని పెద్ద సమస్యలా ఫీల్ అవ్వడం లేదు. బావుందన్నా.. నిజంగా బావుంది.. ఎన్టీఆర్ కూడా కనిపిస్తే ఇంకా బావుండేది అంటూ ఎన్టీఆర్ విజువల్స్ నే కట్ చేసుకొని మురిసిపోతున్నారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.