Big Stories

Sun Burn: సన్‌బర్న్ నివారణకు అద్భుతమైన చిట్కాలు..

 

- Advertisement -

Sun Burn: ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది సన్ బర్న్ బారిన పడుతుంటారు. దీనిని అలాగే వదిలేస్తే చర్మంలో లోతుగా చొచ్చుకుపోయి దీర్ఘకాలిక స్కిన్ పిగ్మెంటేషన్‌కు కారణమవుతుంది. దురద, చర్మం ఎర్రగా మారండం వంటివి జరుగుతాయి. ఇలాంటి వాటి నుంచి ఉపశమనం అవసరం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సహజంగానే చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, నివారణ మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

1. దోసకాయ

దోసకాయను బాగా తురిమి ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లబడనివ్వాలి. దానిని సన్ బర్న్ బారిన పడిన చోట అంటే మంట ఉన్న చోట పెట్టి ఉంచడం వల్ల చర్మం చల్లబడుతుంది.

2. కొబ్బరి- కొబ్బరి పాలు

కొబ్బరి లేదా కొబ్బరి పాలు, నీళ్లను కూడా వాడవచ్చు. మంట ఉన్న చోట రాయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది.

3. అలోవెరా జెల్

సన్‌బర్న్ వల్ల కలిగే నష్టాన్ని రిపేర్ చేయడంలో అలోవేరా జెల్ సహాయపడుతుంది. దాని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మాన్ని సహజంగా రిపేర్ చేసి వాపును కూడా తగ్గిస్తుంది.

4. గంధం

ఇది శీతలీకరణ లక్షణాలతో నింపబడిన మరొక సహజ నివారణ. ఇది నయం చేయడంలో సహాయపడుతుంది. మచ్చలను తగ్గిస్తుంది. చర్మంపై ఎరుపును తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేయడానికి గంధపు చెక్క పేస్ట్‌ను నీటిలో పలుచన చల్లటి రోజ్ వాటర్‌తో కలిపి అప్లై చేసుకోవాలి.

5. పెరుగు

ఎర్రబడిన చర్మాన్ని చల్లబరచడంలో సహాయపడుతుంది. వెంటనే మంటను కూడా తగ్గిస్తుంది. పెరుగును నీటిలో కలిపి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

6. చల్లని పాలు

దూదిని ఉపయోగించి చల్లటి పాలను కాలిన చర్మంపై పూయండి. ఇది మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని సహజంగా హైడ్రేట్ చేస్తుంది. వెంటనే ఎరుపు, వాపును తగ్గించే శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తుంది.

7. పసుపు

పసుపు + శనగపిండి + పెరుగు మిక్స్ చేసి పేస్ట్‌లా తయారు చేసి, దానిని మీ ముఖానికి అప్లై చేసి, 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై శుభ్రం చేసుకోండి.

8. పపాయా

3 టీస్పూన్ల ఓట్ మీల్, పండిన బొప్పాయి గుజ్జు, ఒక టీస్పూన్ పెరుగుతో పేస్ట్‌ను సిద్ధం చేయండి. ప్రభావిత చర్మం అంతటా సమానంగా పూసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News