BigTV English

YCP Star Campaigners: సామాన్యులే వైసీపీ స్టార్ క్యాంపెయినర్స్..

YCP Star Campaigners: సామాన్యులే వైసీపీ స్టార్ క్యాంపెయినర్స్..

Jagan Names 12 ‘Common Voters’ among YSRCP’s ‘Star Campaigners’: ఎన్నికలు అధికారం దక్కించుకోవడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఏకైక మార్గం. ఈ ఎన్నికల్లో గెలవాలంటే సరైన, బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలి. అయితే ఈ సెలక్షన్ ఎంత ముఖ్యమో.. ఎట్ ది సేమ్ టైమ్ ప్రచారం చేసే నాయకులూ అంత ముఖ్యం. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడం మాములే కానీ జనాన్ని అట్రాక్ట్‌ చేసే నాయకులు కూడా చాలా అవసరం. అందుకే ప్రతిపార్టీ స్టార్ క్యాంపెయినర్‌ను ఎంపిక చేస్తుంది. అయితే వైసీపీ స్టార్‌ క్యాంపెయినర్ల లిస్ట్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అదేంటో చూద్దాం.


37 మంది వైసీపీ స్టార్‌ క్యాంపెయినర్‌ లిస్ట్‌లో ఉన్న నంబర్ ఇది. ఇందులో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు, ఇతర నేతలూ ఉన్నారు. ఇది కాదు ఇక్కడ హైలేట్ పాయింట్.. ఈ 37 మందిలో 12 మందికి అసలు రాజకీయాలతో సంబంధం లేదు. అదే ఇక్కడ అసలు పాయింట్‌. మరి ఎవరీ 12 మంది? వారికి స్టార్ క్యాంపెయినర్‌ ట్యాగ్‌ ఎలా వేసింది వైసీపీ? ఈ 12 మందిలో నలుగురు గృహిణిలు ఉన్నారు. ఇద్దరు రైతులు ఉన్నారు.. ఒకరు ఆటో డ్రైవర్. ఒకరు టైలర్, మరో నలుగురు రాజీనామా చేసిన గ్రామ వాలంటీర్లు. అధికారంలో ఉన్న పార్టీ స్టార్ క్యాంపెయినర్స్‌గా ఇలాంటి వారిని సెలెక్ట్‌ చేయడం కాస్త ఇంట్రెస్టింగ్‌ పాయింట్.. మాములుగా ఫిల్మ్ స్టార్స్, ఇన్‌ఫ్లూయెన్సర్స్‌, లేదా సోసైటీలో పెద్దలుగా ఉండే వారిని ప్రచారం కోసం ఉపయోగించుకుంటాయి పార్టీలు.

కానీ దేశ చరిత్రలో ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కామన్‌ పీపుల్‌నే స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించి.. ఆ లిస్ట్‌ను ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు కూడా సబ్మిట్ చేసింది. అయితే స్టార్‌ క్యాంపెయినర్‌కి కొత్త మీనింగ్ చెబుతుంది వైసీపీ.. తమ పథకాల లబ్ధిదారులు, సామాన్య ప్రజలే తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ అంటోంది. అందుకే లిస్ట్‌లో వారిని చేర్చామని చెబుతుంది. ఇప్పుడు వీరంతా జిల్లా, మండల, నియోజకవర్గ, గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహించనున్నారు.


Also Read: రాష్ట్రంలో 30 వేల మంది ఆడబిడ్డల తాళిబొట్టు తెంచారు: చంద్రబాబు

వైసీపీ స్టార్ క్యాంపెయినర్స్‌ లిస్ట్‌లోని కొందరి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తే తేలిందేంటి అంటే.. పందలనేని శివప్రసాద్.. ఇయన అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన ఈయన.. ఓ రైతు కుటుంబానికి చెందినవారు. కటారి జగదీష్‌.. అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన ఇయన.. రోడ్‌ సైడ్‌ ఓ షాప్‌ ఉంది.. బైక్స్‌కు సీట్‌ కవర్స్‌ కుడతారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అనంత లక్ష్మీ ఓ బట్టల షాప్‌లో పనిచేస్తారు. ఇక గవర్నమెంట్ టీచర్‌గా పనిచేస్తున్న సయ్యద్ అన్వర్‌ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందినవారు.ఇక గ్రామ వాలంటీర్‌గా పనిచేసిన రిజైన్ చేసిన చల్లా ఈశ్వరి మైలవరం నియోజకవర్గానికి చెందిన వారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో బ్యాక్‌గ్రౌండ్.. ఇప్పుడు వీరంతా వైసీపీ స్టార్ క్యాంపెయినర్స్..

ఇవన్నీ ఎలా ఉన్నా.. నిజానికి వైసీపీలో ప్రామినెంట్ ఫేస్ వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిది మాత్రమే.. ఎవరెంత ప్రచారం చేసినా.. ఎన్ని సభలు, సమావేశాలు నిర్వహించినా అది ఆ ప్రాంతం వరకే పరిమితం. కేవలం జగన్‌ మాట్లాడితే మాత్రమే స్టేట్‌ మొత్తం రీచ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ పార్టీలో జగన్ వన్‌ మ్యాన్‌ షో చేస్తున్నాడనే చెప్పాలి. నిజానికి వైసీపీకి ఎంత బలగం ఉన్నా.. బలం మాత్రం జగన్ మాత్రమే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి వైఎస్ ష‌ర్మిల‌, వైఎస్ విజ‌య‌మ్మలు స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ప్రచారం చేశారు. వీరికి తోడు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మోహ‌న్‌బాబు, అలీ వంటివారు కూడా ప్రచారంలో దూకుడు చూపించారు.

Also Read: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

కానీ ఈసారి ఆ సినిమా కనిపించడం లేదు. షర్మిల కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. అన్నా చెల్లెల్ల పోరు చూడలేక వేరే దేశానికే వెళ్లిపోయారు. సో ఈసారి కుటుంబం నుంచి అంతగా సపోర్ట్ లేదు జగన్‌కి..
దీంతో ప్రచార భారాన్ని మొత్తం ఆయన ఒక్కరే మోస్తున్నారు. కానీ విపక్ష పార్టీ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నాయి. దీంతో ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో పాటు.. మూడు పార్టీల కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నుంచైతే లెక్కకు మించి నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. లోకేష్‌, బ్రహ్మాణి, బాలకృష్ణతో పాటు పవన్‌తో పాటు మొత్తం మెగా కాంపౌండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. అటు ప్రధాని మోడీ కూడా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. దీంతో విపక్ష వర్గం మొత్తం అస్త్రశస్త్రాలను వైసీపీపై ప్రయోగిస్తుంది. కానీ అధికార పక్షం పరిస్థితే కాస్త కంగారుగా ఉందనే చెప్పాలి.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలను కురుక్షేత్ర సమరంతో పొలుస్తున్నాయి అధికార, విపక్షాలు.. మరి ఈ సమరంలో ఓ వైపు జగన్ కనిపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు కనిపిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్స్‌ అని చెబుతున్న వైసీపీ నేతల ప్రభావం ప్రజలపై పడే అవకాశం కూడా అంతంతమాత్రమే.. మరి ఈ స్టార్ క్యాంపెయినర్స్‌తో జగన్ ఎలా నెగ్గుకొస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags

Related News

YCP Digital Book: ఒక్కొక్కరికి ఇక సినిమానే..! డిజిటల్ బుక్‌పై టీడీపీ రియాక్షన్ ఏంటి?

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Luxury Cars Scam: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Big Stories

×