E-Paper
Advertisement

Election Commission Transfers: సీఎం సన్నిహితుడి సతీమణి బదిలీ.. భారీ చర్చ!

Election Commission Transfers: సీఎం సన్నిహితుడి సతీమణి బదిలీ.. భారీ చర్చ!
Advertisement

Election Commission Transfers Odisha Bureaucrat Sujata: ఆ రాష్ట్రంలో ఆమె ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిణి. అయితే, ఆమెపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు వచ్చిన గంటలోనే ఎన్నికల సంఘం ఆ అధికారిణిని బదిలీ చేసింది. ప్రజా వ్యవహారాలకు సంబంధం లేని డిపార్టుమెంటుకు వెంటనే బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ అంశంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్నికల వేళ ఒడిశా రాష్ట్రంలో ఓ అధికారిణిని బదిలీపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సన్నిహితుల్లో ఒకరు వీకే పాండియన్. అయితే, ఆయన సతీమణి సుజాత ప్రభుత్వ ఉన్నతాధికారిణి. ఆమె మిషన్ శక్తి విభాగంలో కమిషనర్ కమ్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఆమెపై ఈసీకి స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆమె రాష్ట్రంలో బీజేడీ ఏజెంట్ గా పని చేస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆమెపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. గంటలోనే ఆమెను బదిలీ చేసింది. అది కూడా ప్రజా వ్యవహారాలకు సంబంధంలేనటువంటి విభాగానికి తక్షణం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె బదిలీ విషయమై ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో తీవ్ర చర్చ కొనసాగుతోంది.

Advertisement

Also Read: Newborn hurled: శిశువును రోడ్డుపై విసిరేసిన యువతి.. ఆమెను పోలీసులకు పట్టిచ్చిన పార్శిల్ కవర్

అయితే, ఇది ఇలా ఉంటే.. సుజాత భర్త వీకే పాండియన్ కూడా ఐఏఎస్ అధికారే. అయితే, ఆయన గత ఏడాది స్వచ్ఛంద ఉద్యోగ విరణ చేశారు. ఆ తరువాత బీజేడీలో చేరారు. నవీన్ పట్నాయక్ సన్నిహితుల్లో ఒకరుగా పాండియన్ కు పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయన సతీమణి బదిలీ విషయమై తీవ్ర చర్చ కొనసాగుతోంది.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×