Big Stories

Elections Heat in Telugu States: ప్రచార పర్వం.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఈ పద్దినాలోకలెక్క.. హీటేక్కిన తెలుగు రాష్ట్రాలు

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. మేనిఫెస్టోలు ప్రకటించాయి.. వాటిపైన ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. స్టార్ క్యాంపెయినర్లు ఇళ్లల్లో తక్కువగా.. సభలు, సమావేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రధాని మోడీతో సహా అన్ని పార్టీల జాతీయ నేతల విమానాలు రెండు తెలుగు రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి. ఒకేరోజులో పాల్గొనే సభలు, సమావేశాల సంఖ్య పెరుగుతోంది. ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు హామీలు, విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిలుతోంది. పార్టీ ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది లెక్కలు వేసుకొని మరీ అక్కడే టార్గెట్ చేస్తున్నారు.

Also Read: ప్రచార వ్యూహాలు..సెల్ఫ్ గోల్స్

ముందుగా తెలంగాణ సంగతి చూస్తే.. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్, ప్రియాంకగాంధీలు రాష్ట్రానికి రానున్నారు. వీరంతా బహిరంగసభలతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఇక బీజేపీ సంగతి చూస్తుంటే ఇప్పటికే ప్రధాని మోడీ పలుసార్లు పర్యటించగా వచ్చే పది రోజుల్లో కేంద్రహోంమంత్రి అమిత్‌ షా కూడా రాష్ట్రానికి రానున్నారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ జాతీయ నేతలు కూడా రాష్ట్రానికి తరలి రానున్నారు.ఇక బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ ఇప్పటికే బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ నెల 10 వరకు ఆయన 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగనుంది.

ఇక ఏపీ సంగతి చూస్తే.. ఇక్కడి రాజకీయం సెగలు రేపుతోంది. ఇప్పటికే ఇరు పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి. ప్రజలపై ఉచిత వర్షం కురిపించాయి. ఇప్పుడు వీటిని ప్రచారం చేసుకోవడంలో బిజీబిజీగా ఉన్నాయి. అటు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ నేతలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇక అధికార వైసీపీలో వైఎస్ జగన్ వన్‌ మ్యాన్‌ షో చేస్తున్నారు. అయితే ఏపీ, తెలంగాణలో రెండు విభిన్న అంశాలపై ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో రెండే అంశాలు ఇప్పుడు హైలేట్‌గా ఉన్నాయి. అందులో ఒకటి హిందూత్వం.. రెండోది రిజర్వేషన్లు.. బీజేపీ హిందూత్వ కార్డ్‌ను ఉపయోగిస్తుంది. ప్రధాని మోడీతో పాటు అమిత్‌ షా ఇతర పార్టీ నేతలు ముస్లిం రిజర్వేషన్ల అంశాలను తెరపైకి తెస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ మాత్రం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. బీజేపీకి మళ్లీ అధికారం వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే తాము రిజర్వేషన్లను రద్దు చేయడం లేదంటూ బీజేపీ క్లారిటీ ఇచ్చింది.

Also Read: T-congress Manifesto : తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్.. 5 న్యాయాలు, ప్రత్యేక హామీలు

తాను ఆరోపణలు చేసిన తర్వాతే మోడీ, షా భయపడ్డారని అందుకే రిజర్వేషన్ల రద్దు అంటూ కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. అంతేకాదు తాను చేసిన ఆరోపణలకు పక్కా ఆధారాలు ఉన్నాయంటూ వాటిని కూడా భయటపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ సినారియో.. ఏపీలో మాత్రం కంప్లీట్ రివర్స్.. అక్కడ రెండు ప్రాంతీయ పార్టీలదే హవా.. ఉచితాలే ప్రధానం. మమ్మల్ని నమ్మండి.. ఓటు వేయండి అంటూ ఇరు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. సో ఓవరాల్‌గా చూస్తే మనం ముందుగా చెప్పుకున్నట్టు రాబోయే పది రోజుల్లో ఎన్నికల ప్రచారం ఎటు వైపైనా టర్న్‌ తీసుకునే చాన్సేస్ ఉన్నాయి. ఈ పది రోజుల్లో మరిన్ని సంచలనాలు జరిగే చాన్స్‌ ఉంది. సో ప్రజలంతా ఆగ్రహావేశాలు, నేతల మాటల ప్రలోభాలకు కాకుండా ఏది మంచి.. ఏది చేడు.. ఏ పార్టీకి ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేది మా రిక్వెస్ట్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News