E-Paper
Advertisement

Soaked Green Chilli Water Benefits: పచ్చిమిర్చి నానబెట్టిన నీళ్లు ఎప్పుడైనా తాగారా..? ప్రయోజనాలు తెలిస్తే హవాక్కవుతారు

Soaked Green Chilli Water Benefits: పచ్చిమిర్చి నానబెట్టిన నీళ్లు ఎప్పుడైనా తాగారా..? ప్రయోజనాలు తెలిస్తే హవాక్కవుతారు
Advertisement

Benefits of Soaked Green Chilli Water: వంటలు రుచిగా ఉండాలంటే పచ్చిమిర్చి తప్పకుండా ఉండాల్సిందే. అది లేకుండా వంట చేయడం అసాధ్యమనే చెప్పాలి. వంటింట్లో ఉండే మసాలా ఐటమ్స్ లో పచ్చిమిర్చి ఒకటి. అయితే పచ్చిమిర్చి కారంగా ఉంటుంది. కాబట్టి కేవలం వంటల్లో మాత్రమే ఉపయోగించడానికి తోడ్పడుతుంది అని అనుకుంటే పొరపాటనే చెప్పాలి. పచ్చిమిర్చిని కేవలం వంటల్లో వాడితే రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

పచ్చిమిర్చిలో అనేక పోషకాలు ఉంటాయి. పచ్చిమిర్చిని నానబెట్టిన నీటిని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యల బారి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిర్చి నీటిని తాగడం వల్ల శరీరానికి కలిగే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు. పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు, ఇతర వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

Advertisement

Also Read:Health Tips: నీరు ఎక్కువగా తాగితే.. బరువు తగ్గుతారా ?

శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ కావడానికి కూడా పచ్చిమిర్చి తోడ్పడుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా పచ్చిమిర్చిలో ఉండే బీటా కెరోటిన్ అనే విటమిన్ కూడా ఆరోగ్యానికి అనేక రకాలుగా తోడ్పడుతుంది. బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారు పచ్చిమిర్చి నానబెట్టిన నీటిని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పచ్చిమిర్చి నీటితో జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×