BigTV English

PM Modi Election Campaign: మారిన ప్రధాని మోడీ ప్రచారశైలి.. ఆ భయమే కారణమా?

PM Modi Election Campaign: మారిన ప్రధాని మోడీ ప్రచారశైలి.. ఆ భయమే కారణమా?

Change in PM Modi Speech in Election Campaigns: మాట మారింది.. తీరు మారింది. అభివృద్ధి మంత్రం పక్కకు పోయింది. హిందూత్వ ఏజెండా ముందుకు వచ్చింది. మతం మళ్లీ ఆయుధమైంది. పాక్‌ పేరు మళ్లీ వినిపిస్తోంది. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా.. ? ప్రధాని నరేంద్రమోడీ ప్రచారాన్ని అబ్జర్వ్‌ చేస్తే కనిపించిన విషయాలు. ఇంతకీ మోడీ ప్రచారం ఎలా మొదలైంది.. ? ఇప్పుడు ఎలా కొనసాగుతుంది? 400 సీట్లు.. ఎన్డీఏ కూటమికి ప్రధాని మోడీ ఇచ్చిన టార్గెట్ ఇది. ఈ టార్గెట్‌ను రీచ్‌ అయ్యేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నారు. దీనికి తగ్గట్టుగానే మోడీ ప్రచారం మొదలుపెట్టారు. తమ విజన్ 2047 అని.. దేశంలో అభివృద్ధికి రూట్‌ మ్యాప్‌ వేస్తున్నామని ప్రచారం చేశారు. ఇంతలో ఫస్ట్, సెకండ్ ఫేజ్‌ ఓటింగ్‌ ముగిసింది. కానీ ఆ తర్వాత ఆయన రూట్ మార్చారు. సడెన్‌గా మళ్లీ ముస్లిం రాగం ఎత్తుకున్నారు. విద్వేష పూరిత వ్యాఖ్యలు మొదలు పెట్టారు.


ఎందుకు ఒక్కసారిగా మోడీ ప్రచార శైలి మారింది? ఉన్నట్టుండి ఎందుకు విద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు.. ? మత ప్రాతిపదికన ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్.. ఎప్పుడైతే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాటలు వైరల్‌ అయ్యాయో.. అప్పటి నుంచి మోడీ తన ప్రచార స్టైల్‌ను మార్చేశారు. చొరబాటుదారులు, మంగసూత్రాలు లాక్కుంటారు అనే పదాలను తన స్పీచ్‌లో వాడటం మొదలు పెట్టారు. అప్పుడెప్పుడో 18 ఏళ్ల నాటి వీడియో సడెన్‌గా బయటకు రావడం.. దానిపై మోడీ రియాక్ట్ అవ్వడం.. నిజంగా కొంచెం అనుమానస్పదంగానే ఉంది.

ఫస్ట్ ఫేజ్‌ ఓటింగ్ ముగిసన తర్వాత ఆయన టోన్ మార్చారు. నిజం చెప్పాలంటే మోడీ ప్రచారంలో రామమందిర ప్రాణప్రతిష్ఠ రానురాను తగ్గిపోయింది. గత ఎన్నికల్లో చౌకీదార్ అని చెప్పుకున్నారు మోడీ.. కానీ ఈసారి వచ్చేసరికి మోడీకి గ్యారెంటీ అన్నారు. కానీ దానిని కూడా ఇప్పుడు తక్కువగా వాడుతున్నారు. ఆయన క్యాంపెయిన్‌ను అబ్జర్వ్‌ చేస్తే ప్రచారం మొత్తం రిజర్వేషన్లు, కాంగ్రెస్‌పై విమర్శలపైనే ఫోకస్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది.


Also Read: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..

తన ప్రచారంలో పాకిస్థాన్‌ను కూడా ఇన్‌క్లూడ్ చేశారు మోడీ.. పాక్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని గుర్తు చేశారు. యువరాజును ప్రధానిని చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతోందంటూ మరోసారి సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేశారు. దేశంలో కాంగ్రెస్ బలహీనంగా తయారవుతోంది. ఇక్కడ కాంగ్రెస్ చనిపోతుంటే అక్కడ పాకిస్థాన్ ఏడుస్తోంది. కాంగ్రెస్ కోసం పాకిస్థానీయులు ప్రార్థనలు చేస్తున్నారంటూ తనదైన స్టైల్‌లో విమర్శలు చేశారు మోడీ.. అంతేకాదు ప్రధాని మోడీ ప్రసంగంలో ఈ మధ్య ఎక్కువగా వినిపించే పదం కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. ఇలా విని విని.. అసలు ఇప్పటి వరకు కాంగ్రెస్‌ మేనిఫెస్టోను చూడని వారు కూడా చూసేలా చేస్తున్నారు మోడీ.. సో.. ఇన్‌డైరెక్ట్‌గా ఈ మేనిఫెస్టోకు మోడీ ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే మోడీ పదేళ్ల పాలనలో చేసిన విజయాలన్ని పక్కకు వెళ్లిపోయాయి. పాకిస్థాన్‌పై సర్జికల్ దాడులు, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాఖ్ రద్దు.. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ, జన్‌ధన్ యోజన, 80 కోట్లమందికి ఉచిత ఆహార ధాన్యాలు.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం.. వంటి అంశాలపై బీజేపీ నేతలు చాలా అంటే చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. దీనికి బదులు కాంగ్రెస్‌ చేస్తున్న రిజర్వేషన్‌ ప్రచారాన్ని తిప్పి కొట్టడానికే ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న మోడీ మాట్లాడిన మాటలు.

Also Read: Road Accident : ఘోర ప్రమాదం.. లోయలో పడిన కారు.. ఐదుగురు దుర్మరణం

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని.. రిజర్వేషన్లు ఉండవని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టడమే మోడీ పనిగా పెట్టుకున్నారు. మోడీ తీరు చూస్తుంటే ప్రజల మెదళ్లలో కాంగ్రెస్‌ రిజర్వేషన్ అనుమానాలను నాటడంలో కాంగ్రెస్ సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. వీటితో పాటు.. మొదటి రెండు ఫేజ్‌లలో బీజేపీకి తక్కువ ఓటింగ్ పడినట్టు కనిపిస్తోంది. ఈ రిపోర్ట్‌ల ఆధారంగానే మోడీ తన ప్రచారశైలిని మార్చారన్న ప్రచారం కూడా ఉంది. కానీ ఏది ఏమైనా ప్రస్తుతం మోడీ నుంచి ప్రస్తుతం వినిపిస్తున్న కాంగ్రెస్ పదం.. బీజేపీకి మంచి చేస్తుందా? ముంచుతుందా? అనేది జూన్ 4న తేలనుంది.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×