Lover Made a Fuss on Marriage: ఈ తరం యువతకు పెళ్లి అంటే వారి జీవితంలో ఎప్పుడు చేయనంత హడావిడితో ఎంతో ఘనంగా జరుపుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో పెళ్లి కొడుకు, కూతురు నుంచి మొదలుకుని చుట్టాల వరకు పెళ్లిళ్లలో హడావిడి, హంగామా చేస్తూ ఎంతో వైభంగా జరుపుకుంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్, సంప్రదాయమైన ఐదు రోజుల పెళ్లి ఇలా ఎన్నో రకాలుగా పెళ్లిళ్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే ఇలా జరుగుతున్న పెళ్లిళ్లలో ఏదో ఒక వింత ఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఘనంగా జరుగుతున్న ఓ పెళ్లి వేడుకలో వధువుకు తన ప్రియుడు షాక్ ఇచ్చిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పెళ్లిలో జరిగే జయమాల తంతువు పూర్తయింది. ఇంతలోనే వధువుకు షాక్ ఇచ్చేలా తన మాజీ ప్రియుడు వేదికపైకి విచ్చేసాడు. దీంతో ఒక్కసారిగా అతడిని చూసి ఆమె కంగుతినింది. స్టేజీ పైకి ఎక్కిన ప్రియుడు పెళ్లిలో హైడ్రామా క్రియేట్ చేశాడు. ఓవైపు పెళ్లి జరుగుతుండగానే మరోవైపు పెళ్లి వేదికపైనే రచ్చరచ్చ చేశాడు.
Also Read: China Manager Beating African’s: ఆఫ్రికా వర్కర్లపై చైనా మేనేజర్ దాష్టీకం.. కాలుతో తన్ని.. ఆపై..!
వరుడు వేదిక నుంచి కిందకు దిగి బిత్తరపోయి చూస్తున్నాడు. అయితే పెళ్లిలో వరుడికి జయమాల వేసే క్రమంలో ఎంటరైన ప్రియుడు వరుడితో గొడవకు దిగాడు. వేదికపైకి ఎక్కి, వరుడిని కిందకు దించేసి గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఇది నిజంగా జరిగిన ఘటనేనా లేక ఎవరూనా కల్పితంగా సృష్టించారా అనేది మాత్రం తెలియరాలేదు.