BigTV English

Janasena Kiran Royal: అందరికీ రాయల్ ఛాలెంజేనా..? ఇంకెవరూ లేరా..?

Janasena Kiran Royal: అందరికీ రాయల్ ఛాలెంజేనా..? ఇంకెవరూ లేరా..?

కిరణ్‌రాయల్ .. తిరుపతి జనసేన నాయకుడు. పీఆర్పీ స్థాపించినప్పుడు మెగాస్టార్ చిరంజీవిని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించడంలో తనవంతు పాత్ర పోషించి పొలిటికల్ స్క్రీన్‌పై ఫోకస్ అయ్యారు. జనసేన ఆవిర్భావం నుంచి పవన్‌కళ్యాణ్ మీద వీరాభిమానంతో ఆ పార్టీతోనే కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం జనసేనకు దక్కుతుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. దాంతో కిరణ్‌రాయల్ తిరుపతి జనసేన అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించారు. తిరుపతి టికెట్ కోసం ఎన్డీఏ కూటమిలో విపరీతన పోటీ కనిపించింది. ఆ క్రమంలో చివరికి చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరి తిరుపతి టికెట్ దక్కించుకున్నారు.

ఆశించిన టికెట్ నాన్‌లోకల్ అయిన ఆరణి శ్రీనివాసులుకి దక్కినా స్థానికనేత కిరణ్‌రాయల్ నిరుత్సాహ పడటం లేదు.జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై తన లాయల్టీని ప్రదర్శిస్తూనే ఉన్నారు .. జనసేన పట్ల తన కమిట్‌మెంట్‌ను చాటుకుంటూ జనసేనానితో పాటు ఎన్డీఏ కూటమి నేతలపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు తనదైన స్టైల్లో కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న కిరణ్‌రాయల్ ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తున్న తీరుతో రాష్ట్రవ్యాప్తంగా మిత్రపక్షాల శ్రేణులకు ఆప్తుడవుతున్నారు.


Also Read: ముహూర్తం ఓకే, కడపకు రాహుల్, సీఎం రేవంత్

మొన్నటికి మొన్న జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వెంట నడిచారు విజయవాడ వెస్ట్ నేత పోతిన మమేష్  విజయవాడ వెస్ట్ నుంచి కూటమి అభ్యర్ధిగా పోటీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. యితే ఆ సీటు బీజేపీకి దక్కి సుజనాచౌదరి అభ్యర్ధి అయ్యారు.అప్పటి వరకు తన చేతిలో జనసేన జెండా తప్పితే మరో జెండా కనపడితే చేయి నరికేయమని వీరవిధేయత ప్రదర్శించిన పోతిన వాయిస్ సడన్‌గా మారిపోయింది. పవన్ ఫొటో పెట్టుకుని గెలుస్తానని గతంలో చెప్పిన ఆయన వైసీపీలో చేరి పవన్‌కి వ్యక్తిత్వమే లేదని విమర్శలకు దిగరు. వార్ధప్రయోజనాలు కోసం పార్టీ పెట్టారని టీడీపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఈ ఎన్నికల తర్వాత జనసేన పార్టీనే ఉండదని స్టేట్‌మెంట్లిచ్చారు.

పోతిన మహేష్ జనసేనానిని టార్గెట్ చేయడం ప్రారంభించగానే రుపతి నేత కిరణ్‌రాయల్ రియాక్ట్ అయ్యారు. వేరే జెండా తన చేతిలో కనబడితే చేయి నరకమని స్టేట్‌మెంట్లు ఇచ్చిన పోతిన వీడియోను ఫోకస్ చేశారు. జగన్‌ను ఆయన కౌగలించుకున్న ఫోటోతో పాటు. ఇప్పుడే చేయి నరకమంటావు పోతినా టూ కిరణ్‌రాయల్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జనసేనానిని జోలికొస్తే వెంటనే రియాక్ట్ అవుతుంటారు కిరణ్ రాయల్.. గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గాన్ని వైసీపీకి దగ్గర చేసే బాధ్యతను భుజానికెత్తుకున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం… తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, టీడీపీ అధినేత చంద్రబాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఫ్లోలో పవన్ పుట్టుపుర్వోత్తరాలను ప్రశ్నించిన ముద్రగడ ఠాపురంలో ఆయన సేవకులు ఎవరూ లేరని .. ఆయన హైదరాబాద్‌లో పోటీ చేసే దమ్ములేక పిఠాపురం పారిపోయి వచ్చారని యద్దేవా చేశారు. 2004 నుంచి వరుస పరాజయాలు చవిచూస్తున్నముద్రగడ పిఠాపురం నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఆ సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నారు.

Also Read: అన్న, చెల్లెలి మధ్య పోటీ.. రంగంలోకి ఫ్యామిలీ

తనపేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ ప్రకటించగానే సీన్‌లోకి వచ్చేశారు కిరణ్‌రాయల్ .. పద్మనాభరెడ్డి తాతా కొత్తగా మార్చుకునేది ఏముంది. నీ పేరు అదేగా తాతా .. అని ముద్రగడని టార్గెట్ చేసిన వీడియో మళ్లీ హైలెట్ అవుతుంది. ఇక ఇప్పుడు సినీ కామెడీ విలన్ పోసాని కృష్ణమురళీ వంతు వచ్చింది. వైసీపీ సానుభూతిపరుడిగా ఫోకస్ అవుతున్న పోసాని తాజాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తనదైన స్టైల్ లో విరుచుకపడ్డారు… పవన్ కల్యాణ్ ఓ మానసిక రోగి అన్నారు. చిరంజీవి తన తమ్ముని విరాళం ఇచ్చుకోవడం పర్సనల్ అన్న పోసాని కూటమి వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని స్టేట్ మెంట్ ఇచ్చారు. పోసానిపై అంతే వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారు. ఆయన బాషలోనే చెప్తున్నామంటూ రేపు కూటమి అధికారంలోకి రాగానే పోసానిని రాష్ట్రం నుంచి తరిమితరిమి కొడతామని వార్మింగ్ ఇచ్చారు.

రాష్ట్రప్రభుత్వం, సీఎం జగన్‌, వైసీపీ నేతలపై విమర్శలు మానుకోవాలని బెదిరింపులు వస్తున్నా కిరణ్‌రాయల్ దూకుడు తగ్గడం లేదు. పోలీసులు కూడా తనను బెదిరిస్తున్నారని. తన మొబైల్‌లోని ఫొటోలను మార్ఫింగ్‌ చేసి నెట్‌లో పెట్టి పరువు తీస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారంటే పరిస్థితి అర్థమవుతుంది. మరి అలాంటి లాయల్ రాయల్‌కి ఫ్యూచర్లో జనసేనాని ఎలాంటి ప్రయార్టీ ఇస్తారో చూడాలి.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×