Amethi Congress MP Candidate Kishori Lal Sharma: చాలా రోజుల నుంచి అమేథీ, రాయ్ బరేలీ స్థానాలకు సంబంధించి సస్పెన్స్ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే, సస్పెన్స్ కు తెరదించుతూ తమ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమేథీ నుంచి సీనియర్ నేత కిషోరీ లాల్ శర్మను కాంగ్రెస్ బరిలో ఉంటారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కిషోరీ లాల్ శర్మ టాక్ ఆఫ్ ది డే గా మారారు. అత్యంత్ ప్రతిష్టాత్మకంగా భావించే అమేథీ స్థానం టికెట్ ను కిషోరీ లాల్ కు కేటాయించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ఈ కిషోరీ లాల్ ఎవరూ..? ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు టికెట్ ఇస్తారని ఊహాగానాలు వచ్చిన సమయంలో కిషోరీ లాల్ ను పేరు ప్రకటించారు.. అసలు ఎందుకు కేటాయించారు..? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ ఇంటర్నెట్ లో నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారుంటా.
అయితే, అమేథీ స్థానం నుంచి తమ పార్టీ తరఫున కిషోరీ లాల్ శర్మను బరిలోకి దింపుతున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అమేథీ నుంచి బీజేపీ తరఫున స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి.. అసలు ఈ స్థానం నుంచి గాంధీ కుటుంబం నుంచి పోటీ చేస్తారనుకున్న సమయంలో ఈయనకు ప్రత్యేకంగా ఎందుకు టికెట్ ఇచ్చారు.? కిషోర్ లాల్ బలబలాలు ఏంటి అనేటివి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారంటా.
అయితే, అమేథీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కిషోరీ లాల్ శర్మది పంజాబ్ లోని లుధియానా. ప్రస్తుతం ఆయన వయస్సు 84 సంవత్సరాలు. గత 40 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి కిషోరీ లాల్ అత్యంత సన్నిహుతుడని పార్టీ వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. 1983లో తొలిసారి అమేథీకి వచ్చినప్పట్నుంచి నియోజకవర్గంలో పార్టీ తరఫున పనిచేస్తున్నారని తెలుస్తోంది. 1999లో అమేథీ నుంచి సోనియా గాంధీ తొలిసారి గెలుపొందడడంలో కిషోరీ లాల్ శర్మ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.
Also Read: సీఎం సన్నిహితుడి సతీమణి బదిలీ.. భారీ చర్చ
అయితే, రాయ్ బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యవహారాలన్నీ కూడా శర్మనే చూసుకుంటున్నారని, ఈ స్థానాల్లో ఆయనకు మంచి పట్టు ఉందని, ఆయన గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని, ఈ క్రమంలోనే పార్టీ శర్మను ఏరీకోరి.. అదేవిధంగా ఆయన పార్టీకి చేస్తున్న సేవను గుర్తించి అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎలాగైనా సరే ఈ స్థానంలో విజయ బావుటా ఎగురవేయాలని ఇటు కాంగ్రెస్ , అటు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో ఇక్కడ పోటీ చాలా కీలకంగా మారింది.