Big Stories

Honda Activa EV Launch: సరికొత్త వెర్షన్‌లో హోండా యాక్టివా.. లాంచ్ ఎప్పుడంటే..?

Honda Activa Electric Vehicle Launch: దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా యాక్డివా స్కూటీ ప్రియులకు శుభవార్త చెప్పింది. హోండా Activa EVని ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తిని కూడా ప్రారంభించనుంది. హోండా ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై పని చేస్తోంది. వాటి ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీలను స్థానికంగా తయారు చేయనున్నారు. ఇందుకు గాను హోండా ఇటీవల తన గుజరాత్, కర్ణాటక ప్లాంట్‌లను సిద్దం చేసింది. మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ డిసెంబర్ 2024 నాటికి కర్ణాటక ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లుగా తెలిపింది.

- Advertisement -

హోండా ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై పని చేస్తోంది. వాటి ఎలక్ట్రిక్ మోటార్లు  బ్యాటరీలను స్థానికంగా తయారు చేయనున్నారు. ఈ బ్యాటరీలను సేఫ్టీ, లాంగ్ లైఫ్‌తో తీసుకురానున్నారు. ఇందెకోసం గుజరాత్,  కర్ణాటక తయారీ ప్లాంట్‌లను సిద్దం చేస్తోంది. ఇటీవల కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. IC-ఇంజిన్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు రెండింటికీ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం దీని వెనుక కంపెనీ లక్ష్యం.

- Advertisement -

Also Read: బైక్‌‌పై రూ.లక్షల్లో డిస్కౌంట్.. రేపే లాస్ట్

మార్కెట్ విస్తరణ, వృద్ధిపై దృష్టితో హోండా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి రేటును 15 శాతానికి పైగా లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి బ్రాండ్ ప్రవేశం యాక్టివా ఆధారంగా జీరో-ఎమిషన్ స్కూటర్ ద్వారా ఉంటుంది.  EVకి K4BA అనే ​​మోడల్ ఉంటుంది. గుజరాత్ కర్మాగారంలో మూడవ ఉత్పత్తిని ప్రారంభించడం వల్ల దాదాపు 6.6 లక్షల యూనిట్ల అదనపు తయారు చేయనుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక తయారీ యానిట్ ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. దీని ఉత్పత్తి ఈ ఆర్థిక సంవత్సరం క్యూ టూలో ప్రారంభమవుతుంది. మార్కెట్ పునరుద్ధరణకు అనుగుణంగా హోండా FY 2024-25లో 5.75 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ వాల్యూమ్‌లను పోస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది FY 2018-19లో దాని మునుపటి రికార్డు అయిన 5.9 మిలియన్ యూనిట్లకు దగ్గరగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read: టాటా నుంచి కొత్త వెహికల్స్.. ఇదే అతిపెద్ద లాంచ్!

యాక్టివా EV ఈ ఆర్థిక సంవత్సరం Q2 దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించాలని హోండా చూస్తుంది. ఇతర విభాగాలలో కొత్త ఉత్పత్తులు, అప్‌డేట్‌లు కూడా తీసుకువస్తుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల హోండా షైన్ 100ని లాంచ్ చేసింది. ఇది వినియోగదారుల నుండి మంచి ఆదరణ పొందింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News