Big Stories

AP SSC Results 2024: ఏపీలో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

AP 10th Class Results 2024: ఏపీలో పదోతరగతి ఫలితాల విడుదలకు అధికారులు ముహూర్తం ఫిక్స్ చేశారు. లక్షల మంది విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు విదుదల చేయనున్నారు.

- Advertisement -

పదోతరగతి ఫలితాలను ఏప్రిల్ 22న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ప్రకటిస్తారని డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శనివారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఫలితాలను విజయవాడలోని గేట్ వే హోటలో సోమవారం(మార్చి 22న) విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు https://results.bse.ap.gov.in/ వైబ్‌సైట్ చూడాలన్నారు.

- Advertisement -

కాగా, మార్చి 18 నుంచి 30వ తేదీవరకు ఈ పరీక్షలను అధికారులు నిర్వహించారు. ఈ పరీక్షలను రాష్ట్రంలోని దాదాపు 6.3 లక్షల మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో ఈ పదోతరగతి పరీక్షలను అన్ని జిల్లాల్లో నిర్వహించారు.

Also Read: Heat Waves Alert: జర భద్రం.. ఈ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు.. ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. అయితే కేవలం 8 రోజల వ్యవధిలోనే మూల్యాంకన ప్రక్రియ ముగియడం గమనార్హం. ప్రస్తుతం మార్కుల ఎంట్రీతో పాటుగా మరే ఇతర సాంకేతిక సమస్యలు రాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News