BigTV English

UAE Rains Orange Alert: మరోసారి దుబాయ్ ని ముంచెత్తిన వరదలు.. ఆట కాదు.. ఇది వేట!

UAE Rains Orange Alert: మరోసారి దుబాయ్ ని ముంచెత్తిన వరదలు.. ఆట కాదు.. ఇది వేట!

UAE Faces Heavy Rains Again: ఫ్లైట్ సర్వీసులు రద్దు. మూతపడ్డ స్కూళ్లు, బీచ్‌లు.. ఇంటి నుంచి బయటికి రావొద్దని వార్నింగ్‌లు.. ఇది ఏడారి దేశమైన యూఏఈలో వర్షం కారణంగా ఇస్తున్న అలర్ట్స్.. భానుడి భగభగలకు బలవ్వాల్సిన సమయంలో ఈ ఏడారి దేశంలో కుంభవృష్టి వానలు ఎందుకు కురుస్తున్నాయి? దీనికి కారణమెవరు? ప్రకృతిని ఫాలో అవ్వాలి.. కానీ మనకు అనుకూలంగా ఉండేలా మార్చకూడదు. మారిస్తే యూఏఈలో ఏమవుతుందో.. అదే అవుతుంది. ప్రస్తుతం అరబ్ దేశాల సమూహమైన యూఏఈలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.


మొన్న కురిసినవి కాదు.. ఇవి లెటెస్ట్.. ఇప్పటికే సంవత్సరానికి సరిపడా వర్షం.. ఒక్కరోజే కురిసింది. ఇప్పుడు మరోసారి వర్షం దంచికొడుతుంది. మే 1నే నేషనల్ డిజిస్టర్ మేనేజ్‌మెంట్‌ అథారిటీ కీలక ప్రకటన చేసింది. కుండపోత వర్షం కురుస్తుంది.. తస్మాత్ జాగ్రత్త అని అలర్ట్ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని చెప్పింది. అయితే గత నెలలో కురిసిన దానికంటే తక్కువగానే వర్షపాతం నమోదవుతుందని భరోసా అయితే ఇచ్చింది. చెప్పినట్టుగానే అర్ధరాత్రి నుంచి వెదర్ చేంజ్ అయ్యింది. తీవ్రమైన ఈదురు గాలులు వీచాయి. ఆ తర్వాత భారీ వర్షం ప్రారంభమైంది.

నిజానికి ఏప్రిల్‌ 14, 15.. ఈ రెండు రోజులు యూఏఈ హిస్టరీలోనే మర్చిపోలేని రోజు.. 1949 తర్వాత ఆ రెండు రోజుల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఒమన్‌లో 18 మంది వరదల కారణంగా చనిపోయారు. అత్యంత రద్దీగా ఉండే దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే మునిగిపోయింది. నగర వీధులు చెరువులను తలపించాయి. ఆఖరికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే యూఏఈలో కూడా.. సహాయ చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అయితే ఈ వర్షాలు క్లౌడ్ సీడింగ్‌ కారణంగానే జరుగుతున్నాయా? అనేది బిగ్ డౌట్.


Also Read: మంటల్లో హ్యారీ పోర్టర్ కోట..

ఈ మధ్య యూఏఈలో నీటి కొరత పెరిగింది. దీనికి సొల్యూషన్‌గా దుబాయ్‌లో క్లౌడ్ సీడింగ్ చేశారు. అంటే ప్లేన్‌లో ఆకాశంలోకి వెళ్లి మేఘాల్లో సిల్వర్ అయోడైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ వంటి పదార్థాలను చల్లారు. ఇంకేముంది కొన్ని రోజల తర్వాత వర్షాలు షురూ అయ్యాయి. కాకపోతే ఈ స్థాయిలో కుండపోత వర్షాలు కురుస్తాయని వారు ఏమాత్రం ఎక్స్‌పెక్ట్‌ చేసి ఉండరు. తాము తీసుకున్న గోతిలో తామే పడినట్టైంది యూఏఈ పెద్దలు చేసిన పని..

అయితే ఇది కంప్లీట్‌గా క్లౌడ్ సీడింగ్ పనేనా..? అంటే కాదంటున్నారు మరికొందరు వెదర్ ఎక్స్‌పర్ట్స్.. యూఏఈ లాంటి ఎడారి ప్రాంతంలో చాలా కాలం పాటు వర్షలు పడవని.. కానీ కొంత కాలం తర్వాత ఓ పద్ధతి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. అయితే ఈ స్థాయి వర్షం కురువడం మాత్రం అనేది సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌ అనేది వారు చెబుతున్న మాట. రీసెంట్‌గా అరేబియన్ ద్వీపకల్పంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రంలోని తేమను పెద్ద మొత్తంలో పీల్చుకుంది. సో సాధారణం కంటే ఎక్కువగా ఉన్న అధిక తేమ, గాలి ఉష్ణోగ్రతలు. ఈ సైక్లోన్‌కు కారణమని చెబుతున్నారు. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా ఈ దారుణాలకు కారణమన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణం వేడేక్కుతున్న వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇది ముందు ముందు ఇంకా ఎక్కువయ్యే చాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు.

Also Read: Bomb Blast in Balochistan : బలూచిస్థాన్ లో బాంబ్ బ్లాస్ట్.. జర్నలిస్ట్ సహా ముగ్గురు మృతి

మొత్తంగా చూస్తే ప్రస్తుతం యూఏఈలో చిత్ర విచిత్రమైన క్లైమేట్ సిట్యూవేషన్ ఉంది. అప్పుడే ఎండ కొడుతుంది. మరికొంత సమయం తర్వాత కట్టకట్టుకొని దండయాత్రకు వచ్చినట్టు మేఘాలన్ని రావడం భారీ వర్షాలు కురువడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా దుబాయ్‌పై భారీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే దుబాయ్‌ అనేది అన్ని ఇంటర్నెషనల్ ఫ్లైట్ రూట్స్‌కు ఓ ట్రాన్సిట్ పాయింట్.. అందుకే ఇక్కడి ఎయిర్‌పోర్ట్‌ ప్రపంచంలోని అత్యంత బిజీ ఎయిర్‌పోర్ట్‌లలో ఒకటి. అలాంటి ఎయిర్ పోర్ట్‌ ఇటీవలి కాలంలో వర్షం కారణంగా సర్వీస్‌లకు బ్రేక్‌ ఇవ్వడం ఇది రెండోసారి.. సిట్యూవేషన్ ఇలాగే కంటిన్యూ అయితే దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఎఫెక్ట్ పడే చాన్సేస్ కనిపిస్తున్నాయి. ఎట్‌ ది సేమ్ టైమ్ యూఏఈ ప్రజలకు కూడా ఇక్కట్లు తప్పేలా కూడా కనిపించడం లేదు.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×