Case against Union Minister Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసు నమోదు అయ్యింది. మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదయ్యింది. ఈ నెల 1న అమిత్ షా తన ప్రచారంలో చిన్నారులను భాగస్వాములను చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. అమిత్ షాతోపాటు పలువురు బీజేపీ నేతలపై కేసు నమోదు చేయాలని మొఘల్ పురా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు కేంద్రమంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, యమన్ సింగ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా యమాన్ సింగ్, ఏ2 గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీ లత, ఏ3గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏ4 గా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏ5 గా ఎమ్మెల్యే రాజాసింగ్ పేరును చేర్చారు.
అయితే, ఈ నెల 1న పాతబస్తీ పర్యటన సందర్భంగా ఈసీ రూల్స్ ను బ్రేక్ చేశారని, అమిత్ షా ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్ పై కమలం పువ్వు గుర్తు ఉందని, ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బాత్ 400 సీట్స్ అని రాసి ఉందని , ఇది ఎలక్షన్ రూల్స్ కి విరుద్ధమని.. ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదనని, చిన్నారులతో ప్రచారం చేయించారని ఫిర్యాదు చేశారు.
Also Read: Lover Sends Parcel Bomb: గుజరాత్‌లో దారుణం, ప్రియురాలి కోసం పార్సిల్ బాంబ్.. ఏం జరిగిందంటే..
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత మాట్లాడే సమయంలో కొంతమంది మైనర్ బాలికలను తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేయడంతో చిన్నారులు అమిత్ షా వద్దకు వెళ్లారని తెలిపారు. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ పోలీసులను ఆదేశించింది.