BigTV English
Advertisement

KCR Self Goals: కేసీఆర్.. మొత్తం 17 ఎంపీ సీట్లు.. కేవలం 12 మాత్రమే ఎందుకు..? అలా ఎలా..?

KCR Self Goals: కేసీఆర్.. మొత్తం 17 ఎంపీ సీట్లు.. కేవలం 12 మాత్రమే ఎందుకు..? అలా ఎలా..?

జస్ట్ ఫర్ డిబేట్ సేక్.. ఓ లెక్క వేసుకుందాం.. కేంద్రంలో ఎన్డీఏ, ఇండియా.. ఇలా రెండు కూటములు ఉన్నాయి. ఏదో ఒక కూటమి గెలిచి అధికారం చేపడుతుంది.. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ రెండు కూటముల్లో బీఆర్‌ఎస్ ఉందా..? లేదు. బీఆర్ఎస్‌ అటు ఎన్డీఏ కూటమిలో లేదు.. ఇటు ఇండియా కూటమిలో లేదు. నిజం చెప్పాలంటే ఇండియా కూటమిలో చేర్చుకునే పరిస్థితి కూడా లేదు. పోనీ ఇలా రెండు కూటములకు చెందని పార్టీలతో ఆయన ఏదైనా కొత్త కూటమిని ఏర్పాటు చేస్తారా..? అంటే ఆ సీన్‌ కూడా కనిపించడం లేదు..? అలా కూటమిని ఏర్పాటు చేయాలంటే మమతా బెనర్జీ కలిసి రావాలి. ఏపీలో వైసీపీ తోడు రావాలి. ఈ రెండు పార్టీలు తప్ప మరే పార్టీ కూడా ఇప్పుడు సింగిల్‌గా కనిపించడం లేదు. మరి ఈ రెండు పార్టీలతో కేంద్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే చాన్స్ ఉందా..? లేదు. ఒకవేళ ఉన్నా.. మమతా బెనర్జీ బీఆర్ఎస్‌ను దగ్గరికి రానిచ్చే పరిస్థితి కూడా లేదు. మరి కేసీఆర్ చెప్తున్నది ఎలా సాధ్యం..?

Also Read: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..


పోనీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇండియా కూటమిలో చేరాలని అనుకుంటున్నారా..? అందుకే అంత కాన్ఫిడెంట్‌గా నామా కేంద్రమంత్రి అవుతారని వాదిస్తున్నారా..? మాకే కాదు.. తెలంగాణ ప్రజలకు కూడా ఇదే డౌట్ వచ్చినట్టుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి దీనికి క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి కూడా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై వాలకూడదు అంటున్నారు సీఎం రేవంత్.. సో కేసీఆర్ ఇండియా కూటమి గడప కూడా తొక్కే చాన్స్ కనుచూపు మేరలో కాదు కదా.. అస్సలు కనిపించడం లేదు. ఇక మిగిలింది బీజేపీ లీడ్ చేస్తున్న ఎన్డీఏ కూటమి ఒక్కటే. అయితే గియితే ఆయన ఎన్డీఏలో చేరడం ఒక్కటే మిగిలింది.

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇదే డౌట్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.. అయితే ఈ ఆరోపణలకు బలం చేకూరేలా చేస్తున్నారు కేసీఆర్.. కేసీఆర్‌ ప్రస్తుతం బస్సు యాత్ర చేస్తున్న లోక్‌సభ నియోజకవర్గాలు.. 12 కేసీఆర్ తమను గెలిపించాలని కోరుతున్న లోక్‌సభ సీట్లు.. 12 అదేంటి తెలంగాణలో మొత్తం 17 సీట్లు ఎంపీ సీట్లు ఉంటే.. కేసీఆర్ కేవలం 12 మాత్రమే అని ఎందుకు చెబుతున్నారు..? 12 ఆయన లక్కీ నెంబర్ కూడా కాదు కదా మరి వై టువేల్ ఓన్లీ.. ఇదే మెయిన్ క్వశ్చన్.

Also Read: PM Modi Election Campaign: మారిన ప్రధాని మోడీ ప్రచారశైలి.. ఆ భయమే కారణమా..?

మొదటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఓ ప్రచారం నడుస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఉందని. తెలంగాణలో ఐదు నియోజకవర్గాలను బీఆర్ఎస్‌ బీజేపీకి వదిలేసిందన్న ప్రచారం జరుగుతుంది. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్‌ చేయడం లేదన్నది ఆరోపణ.. ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. నిజంగానే నామాను గెలిపించి ఎన్డీఏలో చేరి కేంద్రమంత్రిని చేయాలనుకుంటున్నారా? లేక నామా పేరుతో ప్రజలకు నామాలు పెడుతున్నారా..? ఈ విషయాలపై క్లారిటీ లేదు. కానీ కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. మొత్తానికి కేసీఆర్ తన వ్యాఖ్యలతో మరోసారి తనకు తాను సెల్ఫ్‌గోల్‌ వేసుకున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది.

Tags

Related News

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

German Scientists: గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకులు.. కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌కు ఇదే నాందా?

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Big Stories

×