BigTV English

China Manager Beating African’s: ఆఫ్రికా వర్కర్లపై చైనా మేనేజర్ దాష్టీకం.. కాలుతో తన్ని.. ఆపై..!

China Manager Beating African’s: ఆఫ్రికా వర్కర్లపై చైనా మేనేజర్ దాష్టీకం.. కాలుతో తన్ని.. ఆపై..!

China Manager Beating African Workers: ఆఫ్రికా వర్కర్లను చావబాదుతున్న చైనా మేనేజర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. డామ్ లూక్రే అనే జర్నలిస్ట్ ఎక్స్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు 12 మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా, రేసిజం.. బానిసత్వంపై చర్చలకు దారితీసింది. ఆఫ్రికాలోని వైట్స్‌కి మించి రేసిజాన్నిచైనా అనుసరిస్తోందని లూక్రే ఆ వీడియోకి క్యాప్షన్‌గా రాశాడు.


ఆఫ్రికాలోని వర్కర్లపై చైనా మేనేజర్ల దాష్టీకం కొత్తేమీ కాదు. గత ఏడాది ఏప్రిల్ చైనా ప్రాజెక్టు మేనేజర్లు ఆఫ్రికా వర్కర్లను కట్టుబానిసలుగా ట్రీట్ చేసి హింసించడం సంచలనం రేపింది. 2022లో సెంట్రల్ ఆఫ్రికా దేశమైన రువాండాలో సన్ షుంజున్ అనే చైనా మేనేజర్ ఆఫ్రికా వర్కర్లను తీవ్రంగా హింసించిన వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన అక్కడి కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చైనా రెస్టారెంట్ యజమాని ఒకరు ఇలాగే కెన్యా దేశస్థుడిని హింసించగా 25వేల డాలర్ల జరిమానా విధించింది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి.

లూక్రే షేర్ చేసిన ప్రస్తుత వీడియోలో ఆఫ్రికన్ వర్కర్లు కంటైనర్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా చైనా మేనేజర్ వారిని గొడ్డును బాదినట్టు బాదాడు. అతడి బారినుంచి వారిని కాపాడే నాథుడెవరూ లేరక్కడ. బయటి ప్రపంచానికి తెలియకుండా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి.


Also Read: లోగుట్టు బయటకు.. కిమ్ మామూలోడు కాదు.. నిత్యం అదే పని..!

కెమెరాకు చిక్కిన కొన్ని మాత్రమే వైరల్ అవుతున్నాయి. ఆఫ్రికా దేశంలో ఖనిజాలు పుష్కలంగా ఉండడంతో ఆ దేశంతో చైనా వ్యాపార భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. అక్కడి నల్లజాతీయులతో ఉపాధి ఒప్పందాలు చేసుకుంది. వారికి ఒప్పందం మేరకు చెల్లించాల్సిన వేతనాలు కన్నా తక్కువగా చెల్లించడమే కాకుండా వారిని దారుణంగా హింసిస్తోంది.

Tags

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×