Bad News for Corona Victims : కరోనా బారిన పడినవారికి భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు. గతంలో వారికి గెండె సంబంధిత సమస్యలు లేకున్నా.. కరోనా సోకిన తరువాత అవి ఉత్పన్నం అయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. అయతే ఈ మధ్య అనేక మంది యువత.. తమ పనుల్లో ఉన్నప్పుడే క్షణాల్లో గుండెపోటుకు గురై చనిపోతున్న విషయం తెలిసిందే.
కరోనా ముందు కన్నా కరోనా తరువాత గుండెపోట్లు, గుండె సంబంధిత వ్యాధులు పెరిగినట్లు అధికారిక ఆరోగ్య లెక్కలు చెబుతున్నాయి. ఈ అంశంపై అమెరికా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన.. వచ్చిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత 1.5 కోట్ల కొత్త గుండె జబ్బుల కేసులు నమోదయినట్లు కనుగ్గొన్నారు. వీరిని కరోనా సోకినవారు, సోకనివారిగా విభజిస్తే.. కరోనా సోకిన వాళ్లలో 4 శాతం మందిపై గుండె సంబంధిత వ్యాధులు విరుచుకుపడ్డాయి. అమెరికాలో ఇలా కొత్తగా 30 లక్షల మంది కొత్తగా కరోనా బారినపడినట్లు గుర్తించారు.
గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల్లో.. కరోనా సోకిన వారికే ఎక్కువ డేంజర్ ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. వీళ్లల్లో గుండె పోట్లు 63 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పక్షవాతం వచ్చే అవకాశాలు 52 శాతం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.