Big Stories

Drinking Water After Mango Eat: మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే మహా డేంజర్..

Drinking Water After Eating Mango Shows Bad Effect on Health: వేసవి కాలం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మామిడిపండ్లు. మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వారెవరు ఉండరు. పండ్లలో రారాజుగా పేరుపొందిన మామిడి పండు రుచి, వాసన అంటే చాలా ఇష్టపడుతుంటారు. వేసవికాలంలో ఎండ వేడిమి నుంచి చల్లటి మామిడి కాయలు తింటూ ఆస్వాదిస్తుంటారు. అయితే ఈ మామిడికాయల్లో అనేక పోషకాలు ఉంటాయి.

- Advertisement -

మామిడిపండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి కాయలు కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడతాయి. వేసవిలో దొరికే మామిడింపడ్లను చాలా మంది జ్యూస్ లు, ఐస్ క్రీంలు వంటి వాటిలో ఉపయోగిస్తారు. మామిడిపండులో విటమిన్ సీ, ఏ, ఐరన్, మెగ్నీషియం, కాపర్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

- Advertisement -

ఇవి శరీర ఆరోగ్యానికి అన్ని విధాలుగా తోడ్పడతాయి. అయితే మామిడిపండును తినడం వరకు సరే కానీ, దీనిని తినే క్రమంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు. మామిడి పండును తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతుంటారు. కొంత మందికి మామిడి పండ్లు తిన్న తర్వాత సోడా, లేదా నీళ్లు వంటివి తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా చేయడం చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: పచ్చిమిర్చి నానబెట్టిన నీళ్లు ఎప్పుడైనా తాగారా..? పచ్చి మిర్చి అనగానే అలా చూడకండి.. ప్రయోజనాలు తెలిస్తే హవాక్కవుతారు!

మామిడి పండు తిన్న తర్వాత నీళ్లు తాగితే కడుపుకు సంబంధించిన వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యల బారిన పడతారట. అంతేకాదు పేగుల్లో ఇన్ఫెక్షన్ కూడా తయారయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మామిడి పండును తిన్న తర్వాత మంచినీళ్లు, సోడా వంటి ఎటువంటివి తీసుకోకూడదని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News