Big Stories

Mango Health Benefits : రుచితో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు..

Mango Health Benefits : మామిడికాయలో ఎన్నో పోషకపదార్ధాలు ఉన్నాయి. మామిడికాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మామిడి పండులో కన్నా మామిడి కాయలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కెలరీలు కూడా మామిడి కాయలోనే తక్కువ. బరువు తగ్గాలనుకునేవారు మామిడికాయను తింటే మంచి ఫలితం ఉంటుంది.

- Advertisement -

మామిడికాయలో విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టును చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. గర్భినీ స్త్రీలకు వికారం, వాంతులను కూడా తగ్గిస్తుంది. అజీర్తి మలబద్ధకంతో బాధపడేవారికి మామిడికాయ బాగా పనిచేస్తుంది.. శరీరంలో ఉండే వ్యర్ధాలను కూడా మామిడికాయ తొలగిస్తుంది.

- Advertisement -

కచ్చి మామిడికాయలో కాల్షియం కూడా ఎక్కువే ఉంటుంది. దంతాలకు చాలా మంచిది. మామిడికాయలను ఎక్కువగా తినేవారికి చిగుళ్ల సమస్యలు ఉండవు. మామిడికాయలో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే నియాసిన గుండె జబ్బులను కూడా రాకుండా చేస్తుంది. ఆవకాయ పచ్చడి సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. భోజనంలో కొంత మామిడి పచ్చడి కలుపుకొని తినడం వల్ల కొంత విలువైన పోషకాలు శరీరానికి అందుతాయి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News