BigTV English

Vijayawada East Politics: దేవినేని గద్దె నెక్కుతారా..? తూర్పులో తోపెవరు..?

Vijayawada East Politics: దేవినేని గద్దె నెక్కుతారా..? తూర్పులో తోపెవరు..?

Vijayawada East Politics Devineni Avinash Vs Gadde Rammohan: ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఆ సీటును ఏ పార్టీ కైవసం చేసుకోనుందోననే అంశం.. ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. తమ కంచుకోటను కాపాడుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంటే.. సీటు దక్కించుకునేందుకు వైసీపీ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. అధికారపార్టీ తరుపున దేవినేని అవినాష్‌ బరిలో ఉండగా.. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికై మరోసారి విన్ అయ్యేందుకు రామ్మోహన్ పోటీ పడుతున్నారు. ఇద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందోననే ఇష్యూ ఉత్కంఠగా మారింది.


ఏపీలో రాజకీయాల్లో ఆసక్తి కలిగించే నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు ఒకటి. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన గద్దె రామ్మోహన్‌రావు మూడోసారి విజయం కోసం పట్టుదలతో ప్రచారాన్ని సాగిస్తున్నారు. NDA కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రామ్మోహన్… సూపర్ సిక్స్ పథకాలను ఓటర్లకు తెలియచేస్తూ జనసేన ఓటర్లు, బీజేపీ సపోర్ట్‌తో గెలవాలనే ఆలోచనలో ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో పాటు భార్య అనురాధతో కలసి నియోజకవర్గ వ్యాప్తంగా ముమ్మరంగా పర్యటనలు చేస్తున్నారు.

Also Read: Ambati Son in Law Video : అంబటి రాంబాబుకి ఇంటిసెగ.. అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు ఉండడన్న అల్లుడు


మరోవైపు.. టీడీపీ ఆశలపై నీళ్లు చల్లేందుకు వైసీపీ గట్టి అభ్యర్థినే బరిలోకి దించింది. దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడుగా వచ్చిన యువనేత దేవినేని అవినాష్.. గద్దెను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. గతంలో టీడీపీలో ఉన్న అవినాష్‌.. గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తర్వాత కాలంలో అవినాష్‌ వైసీపీలో చేరారు. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనే ధృడ నిశ్చయంతో దూసుకుపోతున్నారు. తన కుటుంబానికి ఉన్న ఇమేజ్‌తో పాటు జగన్‌ చేస్తున్న పాలనను ప్రజలకు వివరిస్తూ గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకోవడానికి విజయవాడ నగరంలోని తూర్పు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అందులో టీడీపీ కంచుకోటలో పాగా వేసేందుకు అవినాష్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఓ వైపు సొంత ఇమేజ్‌తో గెలుపు అవకాశాలను చూసుకుంటూనే ప్రభుత్వ అభివృద్ధితో గెలుపు ఖాయం చేసుకునే విధంగా పక్కా ప్రణాళికతో అవినాష్‌ ప్రచారం చేసుకుంటున్నారు.

ఇద్దరి బలాబలాలను పరిశీలిస్తే… గద్దె రామ్మోహన్‌తో పోల్చితో దేవినేని అవినాష్‌కు మాస్‌ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇది.. వైసీపీ విజయానికి ఉపయోగపడే అవకాశంగా తెలుస్తోంది. తండ్రి నెహ్రూ ఉన్నప్పటి నుంచి అభినాష్‌..యువతతో మమేకమవుతూ మాస్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఫాలోయింగ్‌తో పాటు తన నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. కృష్ణలంక ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ పనులు.. అవినాష్‌ విజయానికి దోహదం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు కల్పించడంతో అవినాష్ గెలుపునకు అవే బాటలు వేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

Also Read: బీజేపీకి ముస్లింల సపోర్ట్.. వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ!

ఓవైపు.. మాస్ ఇమేజ్‌కు తోడు వైసీపీ సర్కారు చేసిన అభివృద్ధి తోడు అవటంతో విన్నింగ్‌ ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని సర్వేలు కూడా చెబుతున్నాయట. దీంతో అవినాష్‌.. మరింత ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. రెండుసార్లు ఎమ్మెల్యే అయిన గద్దె రామ్మోహన్‌రావుపై గెలుపు అంత సులువు కాదనే వాదనలూ ఉన్నాయి. 2024లో తూర్పు నియోజకవర్గం పీఠం ఎవరికి దక్కబోతుందో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.

Related News

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Luxury Cars Scam: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Big Stories

×