BigTV English

Vadapav Girl Arrest: వడాపావ్ గర్ల్‌ అరెస్ట్.. వీడియో వైరల్.. క్లారిటీ..

Vadapav Girl Arrest: వడాపావ్ గర్ల్‌ అరెస్ట్.. వీడియో వైరల్.. క్లారిటీ..

Vadapav Girl Arrested By Delhi Police: సోషల్ మీడియా మహత్యమా అని ఇటీవల స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే వారు కూడా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. వారు చేసే పనులకు సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతున్నారు. ఇలా ఇప్పటికే చాలా మంది ఫేమస్ అయిన విషయం తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కుమారీ ఆంటీ పేరు ఓ మోత మోగిపోయిందనే చెప్పాలి. ఆమె స్ట్రీట్ ఫుడ్ షాపుకు ఏకంగా సీఎం కూడా వస్తానని హామీ ఇవ్వడంతో వన్ నైట్ లో స్టార్ అయిపోయింది.


ఇలా ఢిల్లీ చాయ్ వాలా వద్ద బిలిగెట్స్ టీ తాగిన వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇలా చాలా మంది సెలబ్రిటీలుగా మారిన తరుణంలోనే ఓ అమ్మాయి పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఢిల్లీలోని వడాపావ్ అమ్మాయి అంటే ఈ అమ్మాయి పేరే గుర్తుకు వస్తుంది. అంత పాపులర్ అయింది.

ఢిల్లీలోని మొంగోల్పురి ఏరియాలో చంద్రికా దీక్షిత్ అంటే తెలియని వారెవరు ఉండరు. ముఖ్యంగా ఆమె పేరు కంటే వడాపావ్ గర్ల్ అనే పేరుతోనే ఆమె ఫేమస్ అయింది. స్ట్రీట్ సైడ్ వడాపావ్ అమ్ముకునే దీక్షితను ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వడాపావ్ స్టాల్ వద్ద భారీ సంఖ్యలో జనాలు గుమిగూడుతున్నారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ తరుణంలోనే ఢిల్లీ పోలీసులకు భండారా జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ జామ్ అయినట్లు ఫిర్యాదులు అందాయి.


Also Read: Teachers Fighting: లేట్‌గా వచ్చిందని టీచర్‌పై ప్రిన్సిపల్ దాడి.. వీడియో వైరల్

దీంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకునన్ పోలీసుతో దీక్షిత అసభ్యంగా ప్రవర్తించిందని అరెస్టు చేశారు. ఈ మేరకు ఆమె వడాపావ్ స్టాల్ ను కూడా సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. అయితే దీక్షితను పోలీసులు ఈడ్చుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. దీక్షితాపై ఎటువంటి కేసు బుక్ చేయలేదని అన్నారు. ఆమెను అరెస్టు చేయలేదని డీసీపీ వెల్లడించారు.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×