Big Stories

Telangana Weather Report: వేడి వాతావరణంలో చల్లటి కబురు.. ఎల్లుండి నుంచి వర్షాలు

Telangana Weather Report: ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. మునుపెన్నడు లేని విధంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఏకండా 47 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత రెండ్రోజులుగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండుతున్న ఎండల కారణంగా వడదెబ్బకు గురై ఇప్పటికే పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మండుతున్న ఎండలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.

- Advertisement -

రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. సోమవారం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో రెండ్రోజులుగా భారీ ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కలగనుంది. కాగా, నిన్న, నేడు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Also Read: Nirmal Janajatara Sabha : రాజ్యాంగం మారితే జరిగేది అదే : నిర్మల్ సభలో రాహుల్ గాంధీ

సూర్యపేట జిల్లాలో శుక్రవారం 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శనివారం కరీంనగర్ జిల్లా వీనవంకలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరిగే పరిస్థితులు ఉండట్లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News