Big Stories

Eye Site Improve Foods: మీ కంటి చూపు తగ్గిపోతుందా..? డైట్‌లో ఈ ఫుడ్‌ చేర్చుకోండి!

Best Foods to Improve Eye Site: సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని అంటారు. అన్ని అవయవాల కంటే కళ్లు చాలా ముఖ్యమైనవి. కళ్లు ఉంటేనే మనం దేన్నైనా చూడగలుగుతాం.చూపులేక పోతే ఆ జీవితం అంధకారం అవుతుంది. అందుకే మన కళ్లను మనం కాపాడుకోవాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపరుచుకోవచ్చు

- Advertisement -

బాదం:

- Advertisement -

దీనిలో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు సంవృద్దిగా ఉంటాయి. ఇవి కంటి చూపు మెరుగుపరచడానికి ఎంత గానో ఉపయోగపడతాయి. అందుకే ప్రతి రోజు ఆరు నానబెట్టిన బాదం గింజలను తినడం వల్ల కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఉసిరి:

ఉసిరి కాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. దీని ద్వారా కనుబొమ్మ లోపల ఉండే రెటీనాలో కొత్త కణాలు తయారవుతాయి. ఒక టేబుల్ స్పూన్ ఉసిరి కాయ జ్యూస్ లో ఒక గ్లాసు నీరు కలిపి తరుచుగా తాగడం వల్ల కంటి సమస్యలు తొలగిపోతాయి.

Also Read: Sugar Patients : మండుటెండలతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు డేంజర్.. వైద్యుల సూచనలు

విటమిన్ ఎ ఎక్కువగా ఉండే క్యారెట్స్,పాలకూర, యాపిల్స్, బీట్ రూట్ , కోడిగుడ్లు, బీట్ రూట్ తదితర ఆకు కూరలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల దృష్టి సమస్యలను దూరం చేసుకోవచ్చు. సోంపు గింజలు కొద్దిగా, ఒక కప్పు బాదాం, కొద్దిగా చెక్కరను తీసుకొని అన్నింటిని పొడిగా చేయాలి. ఒక టేబుల్  ఈ పొడిని తీసుకొని రాత్రి నిద్రించే ముందు గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇలా తాడగం వల్ల అతి తక్కువ సమయంలోనే కంటి చూపు మెరుగుపడుతుంది.

కంప్యూటర్, టీవీ, సెల్ ఫోన్ ఎక్కువగా చూడకూడదు. మధ్య మధ్యలో వీటిని చూసేటప్పుడు విశ్రాంతి ఇవ్వాలి. అంతే కాకుండా కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే కళ్లకు ఎక్కువ శ్రమ కల్పించకూడదు. కొందరు ప్రయాణం చేసేటప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల కంటి చూపు తగ్గే ప్రమాదం ఉంటుంది.

Also Read: డేంజర్.. పండ్లపై క్యాన్సర్ ప్రేరేపిత పురుగుల మందులు.. ఎలా తొలగించాలి?

అధిక ఒత్తిడి, అలసట వల్ల కళ్ల క్రింద వాచినట్లు ఉంటుంది. ఈ సమస్య దూరం కావాలంటే  వాడిన గ్రీన్ టీ బ్యాగులను నీటిలో ముంచి కళ్ల క్రింద పెట్టుకోవాలి.తగినంత నిద్రపోవాలి. అంటే రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. దీంతో పాటు పోషకాహారం తీసుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం, టమాటా గుజ్జు, శనగపిండి, పసుపు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాసుకొని 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. రోజులో ఒకసారైనా ఇలా చేస్తే.. కంటి చుట్టు ఉన్న వలయాలు తగ్గుతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News