BigTV English

Terrorist Attack on Security Forces: భద్రతా బలగాలపై ఉగ్ర దాడి.. గాయపడిన జవాన్లు, ఒకరు మృతి!

Terrorist Attack on Security Forces: భద్రతా బలగాలపై ఉగ్ర దాడి.. గాయపడిన జవాన్లు, ఒకరు మృతి!

Terrorist Attack on Security Forces in Jammu Kashmir: జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. సూరన్ కోట్ ప్రాంతంలో వాహనాలపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులకు గాయాలవ్వగా.. ఒకరు మృతి చెందారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు.


జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. సూరన్ కోట్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్ పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భారత వాయుసేనకు సంబంధించిన వాహనంతో పాటు మరో వాహనంపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఒకరు చికిత్స పొందుతూ మరణించగా.. గాయపడిన మిగతా జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. ఉగ్రవాదులను గుర్తించేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. గత ఏడాది నుంచి ఉగ్రవాదులు జవాన్లపై దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఈ ఏడాది సైన్యంపై జరిపిన అతి పెద్ద దాడి ఇదే. శశిధర్ సమీపంలో ఎయిర్ బేస్ లోపల వాహనాలను భద్రపరిచారు.

Also Read: గుజరాత్‌లో దారుణం, ప్రియురాలి కోసం పార్సిల్ బాంబ్.. ఏం జరిగిందంటే..


ఈ ఉగ్రదాడిని మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. వీరమరణం పొందిన జవాన్ కు సంతాపం తెలిపి, అతని కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ఇదొక పిరికిపంద చర్య అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలో దశలవారిగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో సైనికులపై ఉగ్రదాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. జమ్ముకశ్మీర్ లోనూ ఐదు దశలలో ఎన్నికలు జరుగుతున్నాయి.

Related News

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Ladakh: లడఖ్ నిరసనల వెనుక కుట్ర దాగి ఉందన్న లెఫ్టినెంట్ గవర్నర్

Aadhaar download Easy: ఆధార్ కార్డు వాట్సాప్‌లో డౌన్‌లోడ్.. అదెలా సాధ్యం?

Karnataka News: విప్రో క్యాంపస్ గేటు తెరవాలన్న సీఎం.. నో చెప్పిన ప్రేమ్‌జీ, అసలేం జరిగింది?

Big Stories

×