Big Stories

Causes of Bad Breath: చిన్నారుల్లో నోటి దుర్వాసనకు కారణాలు

Causes of Bad Breath:అనేక మంది చిన్నారులను వేధిస్తున్న సమస్య నోటి దుర్వాసన. దంతాలపై తగిన శ్రద్ధ చూపించకపోవడం వల్ల నోటి దుర్వాసన ఎక్కువ అవుతుంది. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు దంతాలను ఏదో విధంగా వాడుతుంటాం. పళ్లు సరిగా తోమకపోవడం వల్ల కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్ రావడంతో నోటి నుంచి దుర్వాసన వస్తుంది. దీంతో చిన్నారులు ఎవరితోనూ సరిగా మాట్లాడలేకపోతారు. లోలోపల బాధపడుతూ ఉంటారు. అంటుకుపోయే ఆహార పదార్థాల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. సైనసైటిస్‌ లేదా టాన్సిలైటిస్‌ వ్యాధులతో బాధపడేవారిలోనూ నోటి దుర్వాసన అధికంగా ఉంటుంది. పిల్లలు తమ దంతాలను పూర్తిగా శుభ్రం చేయకపోతే నోటిలో ఆహారం ముక్కలు, ఫ్లేక్స్‌ పేరుకుపోతాయి. ఇవే నోటిలో దుర్వాసనను కలిగిస్తాయి. మురికిగా ఉండే నాలుక వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. కావిటీస్‌తో బాధపడేవారిలో కూడా దుర్వాసన వస్తుంటుంది. అందుకే నోటి పరిశుభ్రతకు పిల్లలు ప్రాధాన్యం ఇచ్చేలా చూసుకోవాలి. అంతేకాకుండా లాలాజలం ఆహార కణాలను శుభ్రం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. లాలాజలం లేకపోతే నోట్లోనే బ్యాక్టీరియా ఉండిపోతుంది. ఫలితంతా ఇది నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగకపోతే నోరు డ్రైగా మారుతుంది. ఎవరైతే పిల్లలు నోటి ద్వారా శ్వాస పీల్చుకుంటారో వారి నోటిలో నుంచి దుర్వాసన వస్తుంటుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. చిన్నారులు తెలియకుండా వివిధ వస్తువులను ముక్కులో పెట్టుకుంటుంటారు. దీని వల్ల ముక్కు ఇన్‌ఫెక్షన్‌ వచ్చి వారిలో నోటి దుర్వాసన కనిపిస్తుంది. చిన్నారుల నోటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించగానే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News