PM Modi Comments on Rahul Contest Rae Bareli: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్రమోదీ. అమేథి నుంచి కాకుండా రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేయడానికి తనకు అనుకూలంగా మార్చుకున్నారు ప్రధాని మోదీ.
ఓటమి భయంతోనే యువనేత అమేథి సీటును విడిచిపెట్టినట్టు ఆరోపించారు ప్రధాని మోదీ. ముఖ్యంగా రాహుల్‌కు తాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, డరో మత్ భాగో మత్ అని వ్యాఖ్యానించారు. కేరళలోని వయనాడులో రాహుల్ ఓటమి ఖాయమని సెటైర్లు వేశారు. పోలింగ్ తర్వాత మూడో సీటు గురించి ప్రయత్నాలు మొదలు పెడతారేమోనని వ్యాఖ్యానించారు. భయపడవద్దు దేశమంతా తిరుగుతూ చెబుతున్న ఆ నేతలకు తాను ఓ విషయాన్ని చెప్పాలని భావిస్తున్నారని గుర్తు చేశారు. మీరెవరూ భయపడవద్దు, ఎవరూ పారిపోవద్దన్నారు.
పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తల్లీ కొడుకులిద్దరూ తమ స్థానాలను వదిలేసి పారిపోతున్నట్లు పేర్కొన్నారు. ఆ పార్టీకి చెందిన అతి పెద్ద నేత ఈసారి పోటీ చేయలేదన్నారు. ఒకరేమో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని, మరొకరేమో వయనాడ్‌లో ఓడిపోబోతున్నారని చెప్పుకొచ్చారు.
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సైతం కౌంటరిచ్చారు. వయసు రీత్యా మాజీ అధ్యక్షురాలు సోనియా రాజ్యసభకు నామినేట్ అయ్యారని కౌంటరిచ్చారు. రాహుల్ ఏమాత్రం పారిపోలేదని కాకపోతే సోనియా నియోజకవర్గం నుంచి ఈసారి బరిలోకి దిగుతున్నారని గుర్తు చేశారు. అంతకుముందు బహిరంగ సభల్లో ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో రాహుల్ విరుచుకుపడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దని యువనేత అన్నారు.
#WATCH | Bardhaman-Durgapur, West Bengal: On Congress MP Rahul Gandhi's candidature from Raebareli, PM Modi says, "I had already said in the Parliament that their (Congress) biggest leader will not dare to fight elections and she will run away. She ran away to Rajasthan and came… pic.twitter.com/xKNnGtpq6q
— ANI (@ANI) May 3, 2024