BigTV English

Criminal Case on Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్‌పై క్రిమినల్‌ కేసు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ…!

Criminal Case on Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్‌పై క్రిమినల్‌ కేసు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ…!

Criminal Case Filed on Producer Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తన నటనతో ప్రేక్షకుల్ని అలరించిన గణేష్ ఆ తర్వాత పలు సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఓ వైపు పలు సినిమాలను నిర్మిస్తూ.. మరోవైపు రాజకీయాలలో యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తరచూ తన ట్వీట్లతో వివాదాల్లో చిక్కుకుంటుంటాడు. తాజాగా అతడు చిక్కుల్లో పడ్డాడు.


తాజాగా బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు నమోదు అయింది. ఓ మహిళ అతడిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు గణేష్‌పై కేసు నమోదు చేశారు. మరి ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికొస్తే..

హీరా గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్ అనే మహిళ తన ఇంటిని బండ్ల గణేష్‌కు రెంట్‌కు ఇచ్చింది. అయితే ఆ రెంట్ నెలకు రూ.1లక్ష రూపాయలు. ప్రతి నెల చెల్లించే గణేష్ గతకొద్ది నెలలుగా అద్దె కట్టడం లేదట. దీంతో నౌహిరా షేక్.. గణేష్‌ను అడగ్గా అతడు తనను బెదిరించాడని.. రౌడీలు, రాజకీయ నాయకుల అండతో బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది.


Also Read: నౌహీరా షేక్ వివాదం.. పోలీసులను ఆశ్రయించిన బండ్ల గణేష్‌ కొడుకు..

అంతేకాకుండా.. ఇంటిలో గణేష్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. తన ఇంటిని ఖాలీ చేయమని అతడిని అడిగినందుకు గానూ ఫిబ్రవరి 15న రౌడీలతో తనను బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే రాజకీయ నాయకులు, రౌడీల సహాయంతో తన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నాడని అందులో తెలిపింది. ఈ వ్యవహారంపై నౌహిరా షేక్ డీజీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో గణేష్‌పై ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×