BigTV English

Helicopter Crashes in Maharashtra: ఎన్నికల ప్రచారం కోసం తెప్పిచ్చిన హెలికాఫ్టర్.. కుప్పకూలడంతో..

Helicopter Crashes in Maharashtra: ఎన్నికల ప్రచారం కోసం తెప్పిచ్చిన హెలికాఫ్టర్.. కుప్పకూలడంతో..

Helicopter Crashes in Maharashtra: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావుడీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీల నేతలు ప్రచారాల్లో దుసుకుపోతున్నారు. వీలైన ఎక్కువ చోట్లా నేతలు ప్రచారం చేసి కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. ఇందుకోసం పలు పార్టీలు, పలువురు నేతలు హెలికాఫ్టర్లను వినియోగించే విషయం తెలిసిందే.


అయితే, ఓ నాయకురాలు కూడా ప్రచారంలో పాల్గొనేందుకు హెలికాఫ్టర్ ఉపయోగిస్తున్నారు. ఆ హెలికాఫ్టర్ అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో భారీ శబ్ధం రావడంతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. అయితే విషయం ముందే పసిగట్టిన పైలట్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హెలికాఫ్టర్ ప్రమాదానికి గురవుతున్న తరుణంలో వెంటనే ఆ ఇద్దరు పైలట్లు అందులోంచి బయటకు దూకేశారు. దీంతో వారికి ప్రమాదం తప్పింది. అదేవిధంగా ఇటు ఎవరికి కూడా ఎలాంటి హానీ కాలేదు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ మాత్రం కొన్ని భాగాలు విరిగిపోయి దూరంగా పడ్డాయి. అదేవిధంగా ఫ్యాన్ రెక్కలు కూడా పూర్తిగా విరిగిపోయి చుట్టుపక్కల పడ్డాయి.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన పార్టీ నేత సుష్మా అంధారే హెలికాఫ్టర్ లో వెళ్లి ప్రచార సభలలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. శుక్రవారం కూడా ఆమెను తీసుకెళ్లేందుకు హెలికాఫ్టర్ వచ్చింది. వచ్చినటువంటి ఆ హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. భారీ శబ్ధం చేస్తూ ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అంటూ అంతా ఆందోళనచెందారు. కొద్దిసేపటికి హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైందని వారికి అర్థమైపోయింది. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ భాగాలు ముక్కలుగా విరిగిపోయి చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే, అందులో ఉన్న ఇద్దరు పైలట్లు మాత్రం ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి అందులోంచి దూకేశారు. దీంతో వారికి ఏం కాలేదు. అదేవిధంగా ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం.


Also Read: మోదీ కామెంట్స్, తల్లీకొడుకులిద్దరికి భయం, అందుకే…

అయితే, ప్రమాద విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదం జరగడంతో సుష్మా అంధారే రోడ్డు మార్గం గుండా అక్కడికి బయలుదేరి వెళ్లారు.

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×