E-Paper
Advertisement

PM Modi Andhra Tour: ఏపీలో మోదీ సుడిగాలి టూర్.. ఆంధ్రలో పొలిటికల్ సునామీ

PM Modi Andhra Tour: ఏపీలో మోదీ సుడిగాలి టూర్.. ఆంధ్రలో పొలిటికల్ సునామీ
Advertisement

ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు, రోడ్‌షోల్లో ఆయన పాల్గొంటారు. రాజమండ్రి లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు.

Advertisement

అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొని, రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్‌, కార్యక్రమ నిర్వాహకుల వివరాల్ని బీజేపీ వెల్లడించింది.

Also Read: ఫ్యామిలీలో రాజకీయ చిచ్చు.. ముద్రగడకు కూతురు ఝలక్ 

Advertisement

వాస్తవానికి ఈ నెల 5నే మోడీ ఏపీ ప్రచారానికి వస్తారని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా దాన్ని ధృవీకరించారు. ఏడున దేశ‌వ్యాప్తంగా మూడో ద‌శ పోలింగ్ ఉండటంతో మోడీ షెడ్యూల్ మారిందంటున్నారు. ఏదేమైనా మోడీ రాగానే 7 సాయంత్రం రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి బీజేపీ ఎంపీ కేండెట్ పురంధేశ్వరి ప్రచార సభలో పాల్గొననున్నారు.

అక్క‌డ నుంచి నేరుగా విశాఖ‌ జిల్లాకు వెళ్ల‌నున్నారు. అక్క‌డ విశాఖ, అనకాపల్లి రెండు నియోజకవర్గాలున్నాయి. 2014లో పొత్తుల్లో భాగంగా విశాఖ నుంచి బీజేపీ ఎంపీ గెలిచారు. అయినా ప్రధాని విశాఖలో కాకుండా అనకాపల్లి లోక్‌సభ సెగ్మెంట్లోని రాజుపాలెంలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. అన‌కాప‌ల్లిలో బీజేపీ అభ్య‌ర్థి సీఎం ర‌మేష్ పోటీలో ఉండటం వల్లే షెడ్యూల్ అలా ఫిక్స్ చేశారంట.

Also Read: Ap Politics: ఏపీలో విచిత్ర పోరు..బరిలో మాజీ సీఎంల వారసులు

8వ తేదీ షెడ్యూల్ లోనూ బీజేపీ నేత‌ల‌కే ప్ర‌చారానికి ఆయ‌న ప‌రిమిత‌మ‌య్యారు. అన‌కాపల్లి నేరుగా ఆయ‌న రాజంపేట ఎంపీ అభ్య‌ర్థి, బీజేపీ నేత‌, మాజీ సీఎం నల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్నారు. ఆ సెగ్మెంట్ పరిధిలోని పీలేరులో నిర్వహించే సభలో ఆయన ప్రసంగిస్తారు అనంత‌రం విజ‌య‌వాడలో రోడ్ షో.. విజయవాడ వెస్ట్ నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్య‌ర్థి సుజ‌నా చౌద‌రి కోసమే అంటున్నారు. ఏదేమైనా ప్రధాని షెడ్యూల్ బీజేపీ అభ్య‌ర్థుల ప్ర‌చారానికే ప‌రిమితం కావ‌డం రాజ‌కీయంగా చర్చనీయాంశమైంది

Tags

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×