BigTV English

Prasanna Vadanam OTT Release: ఈ రోజే విడుదలైన ‘ప్రసన్న వదనం’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Prasanna Vadanam OTT Release: ఈ రోజే విడుదలైన ‘ప్రసన్న వదనం’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Actor Suhas Prasanna Vadanam OTT Release: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మొదటిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సిరీ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు సుహాస్. పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరించాడు. ఇక ఎవరికైనా ఓ ఛాన్స్ అనేది వస్తాది.. దానిని వినియోగించుకున్నవాడే ఉన్నతంగా ఎదుగుతాడు అనే దానికి సుహాస్ నిదర్శనం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసుకుంటున్న సుహాస్ కెరీర్‌ను ‘కలర్ ఫోటో’ మూవీ మార్చేసింది. ఈ మూవీలో అతడు హీరోగా ప్రమోషన్ పొందాడు. లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ విపరీతంగా అలరించింది. ఫస్ట్ మూవీతోనే సుహాస్ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.


ఇక ఆ తర్వాత ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాతో వచ్చాడు. ఈ మూవీ కూడా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించి నిర్మాతలకు లాభాల పంట పండించింది. దీంతో సుహాస్‌ క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించాడు. అనంతరం ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’ సినిమాతో ప్రేక్షకుల్ని మనస్సులు దోచుకున్నాడు. లవ్ కాన్సెప్ట్‌ కలిగిన చిత్రాలతో హిట్లు అందుకున్న సుహాస్ ఇప్పుడు మరొక కొత్త కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ను అలరించాడు. సుహాస్ నటించిన కొత్త సినిమా ‘ప్రసన్నవదనం’. ఈ మూవీ ఈ రోజు (మే 3)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also Read: సుహాస్ ‘ప్రసన్నవదనం’ రివ్యూ వచ్చేసింది.. మూవీ ఎలా ఉందంటే..?


సూర్య (సుహాస్)కు ఓ యాక్సెడెంట్ కారణంగా తలకు గట్టి గాయం అవుతుంది. దీంతో అతడికి ఫేస్ బ్లైండ్‌నెస్ అనే డిజార్డర్ సమస్య వస్తుంది. దీని కారణంగా అతడు వేరొకరి ఫేస్‌ను, వాయిస్‌ను గుర్తుపట్టలేడు. అంతేకాకుండా ఓ అమ్మాయిని కొందరు హత్య చేస్తారు. దానిని చూసిన సూర్య పోలీసులకు చెప్తాడు. దీంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు చివరికి సూర్యనే నిందితుడిగా పట్టుకుంటారు. దీంతో ఆ ట్వీస్టు అదిరిపోతుంది. మరి ఎవరో హత్య చేస్తే.. సూర్య ఎలా నిందితుడు అయ్యాడు. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. రిలీజ్‌కు ముందే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకుందని తెలుస్తుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుందని సమాచారం.

Also Read: Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో దిల్‌రాజు మ‌రో మూవీ.. టైటిల్ ఇదే..!

దీంతో ఈ మూవీ థియేట్రికల్ రన్ అనంతరం ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారట. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో సుహాస్‌కు జోడీగా పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించారు. అలాగే రాశీసింగ్, వైవా హర్ష, నందు, సాయి శ్వేత, నితిన్ ప్రసన్నలు కీలక పాత్రల్లో అలరించారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×