BRS MLC Election Cancelled by High court: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది.
Also Read: తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్.. 5 న్యాయాలు, ప్రత్యేక హామీలు
దండె విఠల్ ఎమ్మెల్సీ ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. అంతే కాకుండా ఆయనకు రూ. 50 వేల జరిమాన విధించింది. ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా దండె విఠల్ 2022 లో ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిన తన పేరిట ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరణ పత్రాలు ఇచ్చారని రాజేశ్వర్ రెడ్డి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పునిచ్చింది