Big Stories

Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్‌తో జ్ఞాపకశక్తి.. ఏ సమయంలో తాగాలో తెలుసా..?

 

- Advertisement -

Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ అంటే చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. ఎందుకంటే బీట్‌రూట్‌తో చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చని ప్రతీరోజు రెండు సార్లు తాగేస్తుంటారు. అయితే బీట్ రూట్ చర్మ సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని అందరికీ తెలిసిందే. రక్తాన్ని పెంచేందుకు ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. అయితే బీట్ రూట్ తో కేవలం చర్మ సౌందర్యం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా ఇంకా చాలా లాభాలు ఉంటాయట.

- Advertisement -

దుంపల్లో ఒకటైన బీట్ రూట్ కు మంచి క్రేజ్ ఉంటుంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నవారికి బీట్ రూట్ చాలా బాగా పనిచేస్తంది. రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంపొందించేందుకు కూడా బీట్ రూట్ సహకరిస్తుంది. అయితే బీట్ రూట్ తో కేవలం ఇవే కాకుండా నీరసంతో బాధపడేవారికి కూడా శక్తిని ఇస్తుంది.

Also Read: అరటిపువ్వుతో శరీరంలో మ్యాజిక్..

బీట్‌రూట్‌లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఇందులో విటమిన్లు కూడా అధికంగా ఉండడంతో శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇక గుండె జబ్బులతో బాధపడేవారికి కూడా బీట్ రూట్ ఓ ఔషధంలా పనిచేస్తుందనే చెప్పాలి. బీపీని కంట్రోల్ చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది.

కొలస్ట్రాల్ సమస్యతో బాధపడేవారికి బీట్‌రూట్ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. కాలేయం, చర్మ వ్యాధులు వంటి రకరకాల వ్యాధులకు కూడా బీట్ రూట్ మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. ఇక జ్ఞాపకశక్తి అంతంత మాత్రమే ఉన్నవారికి బీట్ రూట్ జ్యూస్ తాగడం మూలంగా పెంచుకోవచ్చు. మెదడుకు సరిపడా రక్తప్రసరణ చేసేందుకు బీట్ రూట్ జ్యూస్ సహకరిస్తుంది. ఇక ప్రెగ్నెంట్స్ లేడీస్ కు ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. కడుపులోని బేబీ గ్రోత్ కోసం ఈ జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News