Big Stories

Red Corner Notice Issued: ‘రెడ్‌’ కార్నర్ రావుగారు రావాల్సిందే!

- Advertisement -

అంటే పోలీసుల నుంచి తప్పించుకుంటూ విదేశాల్లో తలదాచుకుంటున్న ప్రభాకర్‌ రావు. రోజురోజుకు ఊబిలో కూరుకుపోతున్నారని దీనిని బట్టి అర్థమవుతుంది. ఇంతకీ ఏంటీ రెడ్ కార్నర్ నోటీసులు.. ? ఇవి జారీ చేస్తే వచ్చే నష్టమేంటి? రెడ్ కార్నర్ నోటీస్ or రెడ్ నోటీస్.. దీనిని ఎలాగైనా పిలవొచ్చు. మాములుగా ఒక కేసులో నిందితులుగా ఉన్నవారు కావొచ్చు.. నేరస్థులుగా ఉన్నవారు కావొచ్చు. దేశాన్ని విడిచి పరారవుతారు. అలాంటి వారు ప్రపంచంలోని ఏ దేశానికైనా పారిపొవచ్చు. మన వాళ్లు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి వారిని ఆ దేశాలలోనే గుర్తించి తాత్కాలికంగా అరెస్ట్ చేసేందుకు ఈ నోటిస్‌ జారీ చేస్తారు. అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్‌ సింపుల్‌గా ఇంటర్‌పోల్‌లో సభ్యత్వ దేశంగా ఉంటేనే ఈ నోటీస్‌ను జారీ చేయాలని రిక్వెస్ట్ చేసే అధికారం ఉంటుంది.

- Advertisement -

Also Read: కూకట్ పల్లి హత్యాచారం కేసులో పురోగతి.. నిందితులు అరెస్ట్

ప్రస్తుతం ఇందులో 195 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. ఈ దేశాలన్నింటికి సింగిల్ పాయింట్ ఆఫ్‌ కాంటాక్ట్.. ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో ఇండియా ఇందులో సభ్య దేశంగా ఉండటంతో ఈ రెడ్ నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయగానే అందులో ఆ వ్యక్తికి సంబంధించిన డిటెయిల్స్‌తో ఓ నోటీస్ జారీ అవుతుంది. ప్రతి రిక్వెస్ట్‌ను ఓ స్పెషలైజ్‌డ్ టాస్క్‌ఫోర్స్‌ అనలైజ్ చేస్తుంది. ఇంటర్‌పోల్ రూల్స్‌కు అనుగుణంగా ఆ రిక్వెస్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు.
ఆయా దేశాలు చేసే రిక్వెస్ట్‌లో రాజకీయ దురుద్దేశాలు ఉండకూడదు.

ఆర్మీ ఇన్‌వాల్వ్‌మెంట్ ఉండకూడదు.. మతపరమైన డిమాండ్ ఉండకూడదు. రిక్వెస్ట్‌ చేస్తున్న వ్యక్తి శరణార్థి అయ్యి ఉండకూడదు. ఇలా అన్నింటిని చెక్ చేసి ఓకే అనుకుంటే అతని పర్సనల్ వివరాలను సేకరిస్తారు. ఆ తర్వాత నోటీస్‌ను పబ్లిష్‌ చేస్తారు. ఈ నోటీసులో అతని వివరాలతో పాటు అతను చేసిన క్రైమ్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ నోటీస్ 195 దేశాలను అలర్ట్ చేస్తుంది. వారు ఆయా దేశాల్లో ఉన్న ఇమిగ్రేషన్‌ అధికారులను సంప్రదించి వివరాలతో పాటు.. అవసరమైతే అదుపులోకి తీసుకుంటారు. ఇదీ రెడ్ కార్నర్ నోటీస్‌ డిటెయిల్స్..

ఇలాంటి నోటీసును ఇప్పుడు ప్రభాకర్‌రావుపై జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. ప్రస్తుతం ప్రభాకర్‌ రావు అమెరికాలో ఉన్నారని తెలుసు. కానీ ఎక్కడున్నారు? అక్కడే ఎందుకు ఉంటున్నారు? పలుసార్లు పోలీసులు కోరినా ఎందుకు తిరిగి రావడం లేదు? విచారణను ఎందుకు ఎదుర్కోవడం లేదు? అనేది చాలా రోజుల నుంచి నడుస్తున్న చర్చ.. అయితే ఈ మధ్యే మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఏ రోజైతే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రణీత్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారో ఆ రోజు ప్రభాకర్‌ రావు తిరుపతి జిల్లాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

అంతేకాదు అన్ని ఎవిడెన్స్‌ను ధ్వంసం చేశారని కన్‌ఫామ్ చేసుకున్నాక ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. యూఎస్‌కు వెళ్లేముందు ఆయన కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని తెలుస్తుంది. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే ప్రభాకర్ రావుకు ఆరు నెలల విజిట్ విసా ఉందని పోలీసులు గుర్తించారు. ఇందులో ఇప్పటికే రెండు నెలలు ముగిసింది. మరో నాలుగు పూర్తైతే.. ఆయన వీసా గడవు ముగియనుంది. మరి అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తారు? చచ్చినట్టు ఇండియాకు రావాల్సిందే కదా? అంటున్నారు హైదరాబాద్ పోలీసులు.

Also Read: స్వామి భ‌క్తికి రూల్స్ లేవా!

దీనికంటే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ప్రభాకర్ రావుకు సంబంధించిన విషయాలను ఇప్పటికే యూఎస్ ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు అందించారు పోలీసులు. ప్రస్తుతం ఆయన యూఎస్‌లో ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఓ వైపు ప్రభాకర్‌ రావును ఎక్కడికక్కడ లాక్‌ చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్న పోలీసులు ఇప్పటికే అరెస్టైన వారిపై తప్పించుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అరెస్టైన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేశారు.

దేశ భద్రతకు సాఫ్ట్‌వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై ఈ సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేస్తారు. అలాంటి ఐటీ యాక్ట్ 66(F)ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రయోగించారు పోలీసులు.. ఈ సెక్షన్ కింద కేసు ప్రూఫ్ అయితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్టైన పోలీసులపై ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్‌ ప్రవ్‌ అయితే 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే ఈ సెక్షన్లు పెట్టేందుకు కోర్టు అనుమతించాల్సి ఉంది.రెడ్ నోటీసులు జారీ చేయడం..సైబర్ టెర్రరిజమ్ నోటీసులు జారీ చేయడం చూస్తుంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారనేది అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ప్రభాకర్ రావు ఇండియాకు రావడం.త్వరలోనే అతని స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News