Big Stories

CM Jagan Comments on YS Sharmila: వైఎస్ పేటెంట్ నాదే! వారసుల వార్

- Advertisement -

వైఎస్‌ఆర్ వారసులం అంటూ చాలా మంది వస్తున్నారు. మరి ఆ మహానేతకు వారసులు ఎవరు అని చెప్పాల్సింది ప్రజలు. అంటూ సీఎం వైఎస్‌ పులివెందుల గడ్డపై నుంచి ఇచ్చిన పిలుపు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఓ ప్రకంపనలనే సృష్టించిందని చెప్పాలి. నిజానికి వైఎస్‌ఆర్ ఎవరి మనిషి? ఎవరి వర్గం? వైఎస్‌ఆర్ జీవితకాలం మొత్తం కాంగ్రెస్‌లోన పనిచేశారు. సో ఆయన కాంగ్రెస్ మనిషి అనేది ఆ పార్టీ నేతల వాదన. ఆయన చనిపోయిన తర్వాత మహానేతకు అవమానం చేశారు. అనేక కేసుల్లో ఆయన పేరును కూడా చేర్చారు. కాంగ్రెస్‌ పార్టీ కాదు.

- Advertisement -

ఆయన వైసీపీకి చెందిన వారు అనేది ఈ పార్టీ నేతల వాదన. ఇది కొన్నేల క్రితం వరకు నడిచిన పంచాయితీ ఆ తర్వాత కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఈ వివాదం కూడా సమసిపోయింది. కానీ ఎప్పుడైతే ఏపీ పాలిటిక్స్‌లో మళ్లీ షర్మిల ఎంట్రీ ఇచ్చారో అప్పుడు మొదలైంది. అసలైన వారసుల వార్. మొన్నటి వరకు పార్టీల ఉన్న వివాదం కాస్త ఇప్పుడు ఇంట్లోనే మొదలైంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల పది మాటలు మాట్లాడితే అందులో నాలుగు సార్లు వైఎస్‌ఆర్ పేరు వినిపిస్తోంది. తానే అసలు వారసురాలినంటూ బహిరంగంగానే చెబుతున్నారు షర్మిల.

Also Read: రేపే వైసీపీ మేనిఫెస్టో.. నవరత్నాలకు మించి ?

కడప గడపలో వైఎస్‌ షర్మిల అడుగు పెట్టినప్పటి నుంచి రెండే విషయాలు వినిపిస్తున్నాయి. ఒకటి తానే అసలు వైఎస్‌ఆర్ వారసురాలు అని. రెండోది చిన్నాన్న వైఎస్‌ వివేకా హత్య కేసు. ఆమె ఎన్నికల ప్రచారం మొత్తం ఈ రెండు అంశాల చుట్టే తిరుగుతుంది. ఇన్నాళ్ల పాటు ఈ విషయాలపై సైలెంట్‌గా ఉన్న సీఎం వైఎస్ జగన్. ఇప్పుడు అసలుకే మోసం వస్తుందనుకున్నారో లేక వైఎస్‌ఆర్ అసలైన వారసుడినని తానే అని ఒక్కసారైనా చెప్పాలనిపించిందో కానీ ఇప్పుడు బరస్ట్ అయ్యారు. చెల్లి, చిన్నాన్న అనే కనికరం లేకుండా తీవ్ర విమర్శలు చేశారు.

శత్రువులతో చేతులు కలిపారు. వైఎస్‌ఆర్‌పై అనేక కుట్రలు చేసిన వారితో కలిసి నడుస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన సరిపోదన్నట్లూ సొంత చెల్లెల్లతో కలిసి కుట్రలు చేస్తున్నారంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైమ్.. షర్మిల ప్రచారాస్త్రంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కూడా స్పందించారు జగన్.. వైఎస్‌ అవినాష్‌ ఏ తప్పూ చేయలేదని నమ్మాను అందుకే టికెట్‌ ఇచ్చాను. చిన్న పిల్లాడైన అవినాష్‌ను కనుమరుగుచేయాలనుకోవడం దారుణం. ఇలా సాగిపోయింది జగన్ స్పీచ్.. ఆయన అక్కడితో ఆగలేదు. వైఎస్ వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా? అంటూ ఎన్నడూ లేని విధంగా పర్సనల్ అటాక్ కూడా చేశారు జగన్..ఇప్పుడీ వ్యాఖ్యలను కడప ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది కాస్త ఇంట్రెస్టింగ్‌.. ఎందుకంటే ప్రస్తుతం సౌభాగ్యమ్మ లెటర్ కాస్త వైరల్‌గా మారింది.

సౌభాగ్యమ్మ సూటిగా ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్‌ను నిలదీస్తున్నారు. ఇదేనా నీ బాధ్యత? ఇదేనా నువ్వు చేయాల్సింది? అంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడీ లెటర్ వైరల్‌గా మారింది. ప్రజల్లో సర్క్యూలేట్ అవుతుంది. ఈ హత్య కర్త, కర్మ, క్రియ మొత్తం అవినాస్‌ రెడ్డే అంటున్నారు వివేకా కుటుంబసభ్యులు.. షర్మిల కూడా దీనినే బలంగా నమ్ముతూ.. తాను గెలవడానికి దీన్నే ప్రచారస్త్రంగా మార్చుకున్నారు. వివేకా భార్యేమో కుటుంబంలో ఒకడిగా కాకపోయినా సీఎంగా న్యాయం చేయాలంటున్నారు. కానీ సీఎం జగనేమో హత్యకు అతనికి సంబంధం లేదు కాబట్టే టికెట్ ఇచ్చానంటున్నారు.

అయితే బొత్స సత్యనారాయణ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల.. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టిన బొత్సతో పాటు పెద్దిరెడ్డి, విడదల రజనీ, రోజా ఇలా వైఎస్ఆర్‌ను తిట్టిన వారందరికి జగన్ పెద్ద పీట వేశారంటున్నారు షర్మిల. వైఎస్‌ఆర్‌కు ద్రోహం చేసింది వారంటే వారని.. ఎన్నికల ముందు పరస్పర ఆరోపణలతో హీట్ పెంచుతున్నారు అన్నా చెల్లెల్లు. మరి కడప ప్రజలు ఎవరి మాటలు నమ్ముతారు? ఎవరిని గెలిపిస్తారు? అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్.. మొత్తానికి వైఎస్‌ వారసుల వార్‌ ఇప్పుడు పులివెందుల గడ్డపై కొత్త రాజకీయ చరిత్రను లిఖిస్తుందన్న టాక్ అయితే వినిపిస్తుంది.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News