BigTV English

YS Sharmila Vs Ponnavolu: స్వామిభక్తిని చాటుకున్నారు..

YS Sharmila Vs Ponnavolu: స్వామిభక్తిని చాటుకున్నారు..

YS Sharmila Vs Ponnavolu Sudhakar Reddy – AP Politics: అంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ .. రాజ్యంగబద్ద పదవి.. అట్లాంటి గౌరవ పదవిలో ఉన్న పొన్నవోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. తనకు జన్మనిచ్చింది తన తండ్రి అయినా పునర్జన్మ ఇచ్చింది మాత్రం జగన్‌ అంటున్న ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ మ్యానిఫెస్టో అంతా బూటకమంటున్న వైఎస్ షర్మిల సైతం పొన్నవోలును తప్పుపడుతున్నారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యలపైనా ఆమె జగన్‌పై ఆయన స్వామిభక్తిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు.


వైసీపీ పాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని. ఇప్పుడు కొత్త దాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్‌ను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల టార్గెట్ చేశారు. మద్యనిషేధం చేయకపోగా ప్రభుత్వమే విక్రయిస్తోందని విమర్శించారు. మెగా డీఎస్సీకి బదులు దగా డీఎస్సీ ఇచ్చారని ఆక్షేపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని నిలదీశారు.

ఐదు సంక్రాంతులు వెళ్లాయి. ఒక్క జాబ్‌ క్యాలెండర్ ఇచ్చారా? యువతకు ఎందుకు ఉద్యోగావకాశాలు కల్పించలేదు? ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేకపోయారు? మీ కార్యకర్తలకు మాత్రం వాలంటీర్‌ పోస్టులు ఇచ్చి వాటిని ప్రభుత్వ ఉద్యోగాలుగా చెబుతున్నారని జగన్‌ని షర్మిల టార్గెట్ చేశారు.. ఎన్నికల ముందు హడావుడిగా డీఎస్సీ ఇవ్వడం ఓట్ల రాజకీయమేనని ధ్వజమెత్తారు.


Also Read: ముగిసిన గులకరాయి కట్టు‘కథ’

జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులను పూర్తిచేస్తామని గత మ్యానిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చిందని. ఒక్క ప్రాజెక్టునూ ఎందుకు పూర్తిచేయలేకపోయారని రైతులకు ధరల స్థిరీకరణ నిధి పేరిట రూ.3వేల కోట్లు కేటాయిస్తామన్నారు. ఒక్క ఏడాదైనా కేటాయించారా? మీ హామీలను మీరే నిలబెట్టుకోలేనపుడు ప్రజలు ఎలా నమ్ముతారు. వైసీపీని ఎందుకు నమ్మాలి? పాత మ్యానిఫెస్టోలోని హామీలనే నెరవేర్చనపుడు.. కొత్తదానికి విలువేముంటుందని ప్రశ్నించారు

ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని షర్మిల యద్దేవా చేశారు. మహిళ అనే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలినైన తనను ఏకవచనంతో సంబోధిస్తున్నారని ధ్వజమెత్తానికి. నిజానికి అక్రమాస్తుల కేసు ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌పేరును సీబీఐ చేర్చలేదని దాని నుంచి బయటపడాలంటే వైఎస్‌ఆర్‌ పేరును ఛార్జిషీట్‌లో చేర్చాలనేది జగన్‌ ఉద్దేశమని ఆయన ఆదేశాల మేరకే 3 కోర్టుల్లో పొన్నవోలు పిటిషన్లు వేశారని ఆరోపించారు. అందుకే 2019 మే 30న జగన్‌ సీఏంగా పదవి చేపట్టిన 6 రోజుల్లోనే జూన్‌ 6న పొన్నవోలుకు ఏఏజీ పోస్టు కట్టబెట్టారని గుర్తుచేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసుతో పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేరు మార్మోగిపోయింది. అయితే ఆయన ఏకపక్షంగా వాదనలు వినిపించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన జగన్‌కు వీరాభిమానని చెప్పుకున్న వీడియో ఆరు నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది.

Also Read: చీపురుపల్లిలో సూపర్ ఫైట్.. బొత్స కి కష్టమేనా?

తనకు జన్మనిచ్చింది తన తండ్రి అయినా పునర్జన్మ ఇచ్చింది మాత్రం జగన్‌ అని ఆ వీడియోలో స్వామిభక్తి చాటుకున్నారు పొన్నవోలు.. తాను ట్రయల్ కోర్టు అడ్వకేట్ అయినా తనకు పిలిచి అడ్వకేట్ జనరల్ పోస్టు ఇచ్చారని జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. పదేళ్లుగా జగన్‌తో ఉన్న అనుబంధం గురించి కూడా ఈ వీడియోలో ఆయన వివరించారు. ఆ క్రమంలో షర్మిల వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. షర్మిల రాజకీయలబ్ది కోసం తనపై ఆరోపణలు చేస్తున్నారని తానేంటో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. దానిపై పీసీసీ అధ్యక్షురాలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

ఏదేమైనా ఏఏజీ స్థాయి వ్యక్తి పొలిటీషియన్‌లా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. అంత అభిమానం ఉంటే తన లాయర్ పదవికి రాజీనామా చేసి సజ్జల రామకృష్ణారెడ్డి తరహాలో సలహాదారుడిగా చేరి జగన్‌ చెప్పినట్లు పనిచేయవచ్చు కదా అని సోషల్ మీడియాలో పలువురు సలహా ఇస్తూ.. సెటైర్లు విసురుతున్నారు.

Related News

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Luxury Cars Scam: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Big Stories

×