Big Stories

Banana Flower Benefits: అరటిపువ్వుతో శరీరంలో మ్యాజిక్..

 

- Advertisement -

Banana Flower Benefits: అరటిపండుతో చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అరటి పండును అనారోగ్య సమస్యలు, చర్మ సౌందర్యం వంటి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే అరటిపండుతో పాటు అరటి పువ్వుతో కూడా అంతే ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా మగవారికి అరటిపువ్వుతో అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

అరటిపువ్వుతో మగవారిలో ఎదురయ్యే 7 ప్రధాన సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుందట. అరటి పువ్వు ఓ సంజీవని మాదిరి పనిచేస్తుందట. ఈ మేరకు ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. అరటిపువ్వులో విటమిన్స్ ఇ,సీ,ఎ, పొటాషియం, ఫైబర్, కాల్షియం, ప్రొటీన్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అరటిపువ్వుతో మగవారిలోని చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అరటిపువ్వును వంటల్లో కూడా ఉపయోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

అరటిపువ్వులో నెప్రో ప్రోటెక్టివ్ యాక్టివిటీని కలిగి ఉంటుంది. అందువల్ల అధిక రక్త పోటు వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. అంతేకాదు ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది. బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంచి.. నెమ్మదిగా శరీరంలోని గ్లూకోజ్ ను విడుదల చేస్తుంది. మరోవైపు ఇది యాంటీ హైపర్ టెన్సివ్‌గాను పనిచేస్తుంది. కిడ్నీ సమస్య, మూత్రపిండాలు వంటి ఎటువంగి సమస్యలకైనా ఔషధంలా పనిచేస్తుంది. అరటిపువ్వులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ప్రోస్టేట్ గ్రంధి పరిణామాన్ని తగ్గిస్తుంది. ఇక ఇందులో ఉండే జింక్ శరీరంలోని ఎముకలను బలంగా ఉంచుతుంది.

అరటి పువ్వులో ఉండే ఐనన్ శరీరంలోని రక్తంలోని లోపాలను సరిచేయడానికి సహాయపడుతుంది. ఇందులోని టానిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు వంటివి ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తాయి. శరీరంలోని రక్తం లోపాన్ని తీర్చడానికి కూడా అరటిపువ్వు ఉపయోగపడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News