BigTV English

Viral Video: ఆస్తి కోసం తండ్రిని దారుణంగా కొట్టిన కొడుకు.. వీడియో వైరల్

Viral Video: ఆస్తి కోసం తండ్రిని దారుణంగా కొట్టిన కొడుకు.. వీడియో వైరల్

Viral Video: పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడు అని అంటారు. కానీ ఈ తరంలో అలాంటి పుత్రులు ఉండడం నిజంగా తల్లిదండ్రులు తమ అదృష్టంగానే భావించాలి. పుట్టి కొన్ని సంవత్సరాలు గడుస్తాయో లేదో తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా ప్రవర్తించేలా పిల్లలు తయారవుతున్నారు. చిన్న తనంలోనే తమకు ఏం చేశారు అంటూ నిలదీసేలా పిల్లలు మారిపోతున్నారు. అంతే కాదు తమకు ఆస్తులు సంపాదించలేదని, ఉన్న ఆస్తుల పంపకాలు చేయట్లేదని ఏకంగా తల్లిదండ్రులను హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది.


ఓ వృద్ధ తండ్రిని కుమారుడు దారుణంగా కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్తి కోసం తండ్రిని దారుణంగా చితకబాదాడు. కూర్చీలో కూర్చున్న తండ్రిపై చేయి చేసుకున్నాడు. దారుణంగా కొట్టడంతో తండ్రి ఎదురు తిరిగే శక్తి లేక అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ తరుణంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వచ్చి కొడుకును ఆపాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తండ్రిని దారుణంగా కొట్టిన కుమారుడి వీడియోను జార్ఖండ్ బీజేపీ నేత డా. ధనంజయ్ పుతుష్ షేర్ చేశారు. కొడుకు దెబ్బలతో కుంగిపోయిన తండ్రి కొన్ని రోజులకు మరణించాడని పేర్కొన్నారు. దీనికి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తండ్రి ప్రాణాలను బలిగొన్న దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


Related News

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Big Stories

×