BigTV English
Advertisement

Telugu States Politics: దోస్త్ మేర దోస్త్ చివ‌రికి చింత పీక్క‌లేనా!

Telugu States Politics: దోస్త్ మేర దోస్త్ చివ‌రికి చింత పీక్క‌లేనా!

Telugu States Politics: తెలంగాణలో అధికారంలో కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పడం మొదలుపెట్టారు. ఏపీలో పోరు ఉత్కంఠభరితంగా సాగుతున్నప్పటికీ ఎడ్జ్ ఎన్డీఏ కూటమికే ఉందని ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడించాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడటంతో ప్రీపోల్ సర్వేలకు ఫుల్‌స్టాప్ పడితే  బీఆర్ఎస్ అధ్యక్షుడు మాత్రం తనదైన స్టైల్లో మరోసారి జగన్‌కు మద్దతు ప్రకటించారు. అధికారంలోకి వచ్చేది మళ్లీ జగనేనని తేల్చేశారు. దాంతో ఇప్పుడు అటు నెటిజన్లకి ఇటు టీడీపీ నేతలకు టార్గెట్ అవుతున్నారు ఆ మాజీ సీఎం.


తెలంగాణలో హ్యాట్రిక్ విజయం ఖాయమని ఇక జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేసిన కేసీఆర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద షాకే తగిలింది. సీన్ మొత్త రివర్స్ అయింది. దాంతో జాతీయ రాజకీయాల సంగతి పక్కనపెట్టి రాష్ట్రంలో పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారాయన అలాంటాయన తాజాగా ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్‌పై జోస్యం చెప్పారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది మళ్లీ జగనేనని తేల్చేశారు. వాస్తవానికి కేసీఅర్ ఇపుడే కాదు ఎపుడూ జగన్ పేరే చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న మూడవ ఎన్నిక ఇది.

2014 ఎన్నికల్లో కూడా కేసీఆర్ అదే చెప్పారు. తెలంగాణలో తాను, ఏపీలో జగన్ సీఎంలు అవ్వబోతున్నామని పోలింగ్ ముగియగానే ప్రకటించారు. అది జరగలేదు ఇక 2018లో కేసీఆర్ తెలంగాణాలో రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కి ఆయన అన్ని రకాలుగా సాయపడ్డారన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే కేసీఆర్, జగన్‌ల రహస్య మైత్రిపై టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తుంటారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన ఆస్తుల విషయంలో జగన్ ఉదాసీనంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తుంది.


Also Read: ఈ మాట మీరు చెప్పగలరా..? : సీఎం జగన్

గత ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్ కు ఆర్థికంగా సాయపడ్డారని టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. జగన్ కేసీఆర్ కు మంచి మిత్రుడని, ఆయన అలా మాట్లాడకుండా తాము ఎలా గెలుస్తామని చెబుతాడంటూ టీడీపీ నేతలు ఇప్పుడు మండిపడుతున్నారు. చంద్రబాబు అంటే ఫస్ట్ నుంచి కేసీఆర్ కు పడదని, చంద్రబాబును అనేకసార్లు మీడియా సమావేశాల్లో కేసీఆర్ విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పైగా జగన్ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.

ఇపుడు కూడా గెలిచేది జగన్ అనే కేసీఆర్ చెబుతున్నారు. జగన్ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరి ఆయన జోస్యం ఎంత వరకు కరెక్ట్ అవుతుందో కాని సోషల్ ‌మీడియాలో మాత్రం ఆయన ట్రోల్ అవుతున్నారు. టీడీపీ నేతలైతే కేసీఆర్‌పై ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు.

అయితే ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ అప్రమత్తమయిందంటున్నారు. పార్టీ క్యాడర్ మరింత అలెర్ట్ అవ్వడానికి కేసీఆర్ వ్యాఖ్యలు దోహదపడ్డాయంటున్నారు. జగన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో కూటమి గెలవకూడదని ఆయన కోరుకుంటున్నారని… తన మనసులోని మాట చెప్పారే తప్ప ఆయన ఏమైనా సర్వేలు చేయించారా అని అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అంటే కేసీఆర్‌కు సరిపడదని చంద్రబాబును స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా హైదరాబాద్ లో ఆందోళనలు చేయకుండా అడ్డుకున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ జోస్యం హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు.

 

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×