E-Paper
Advertisement

Janhvi Kapoor: అంబానీ పెళ్లి వేడుకల్లో హంగామా అంతా ‘దేవర’ పాపదే..

Janhvi Kapoor: అంబానీ పెళ్లి వేడుకల్లో హంగామా అంతా ‘దేవర’ పాపదే..
Advertisement

Janhvi Kapoor: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం జూలైలో జరుగనున్న విషయం తెల్సిందే. ఈ పెళ్ళికి ఇంకా మూడు నెలలు సమయం ఉన్నా అంబానీ ఫ్యామిలీలో మాత్రం రోజు పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాధికా మర్చంట్ కోసం స్నేహితులతో కలిసి బ్యాచిలరేట్ పార్టీని ఏర్పాటు చేశారు. రెండు రోజుల నుంచి ఈ పార్టీ నిరాటంకంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ పార్టీకి హోస్ట్ గా మారింది బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. అంబానీ పెళ్లి వేడుకల్లో హంగామా అంతా జాన్విదే. ఇక ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ పార్టీలో వధువు రాధికా సిల్వర్ కలర్ డ్రెస్ వేసుకోగా .. మిగతా స్నేహితులు అంతా పింక్ కలర్ డ్రెస్ లలో కనిపించారు. ఇక పార్టీ అంటే మందు, చిందు లేకుండానా.. ఇదుగో ఇలా జాన్వీ ఫ్రెండ్స్ అందరితో ఛిల్ల్ అవుతూ కనిపించింది. ఈ పార్టీలో అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా, కుమార్తె ఇషా, జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్‌ పహరియాతో పాటు పలువురు ప్రముఖుల కుమార్తెలు, రాధికా ఫ్రెండ్స్ కనిపించారు.

Advertisement

వరుడు అనంత్ ఎక్కడా కనిపించలేదు కానీ, వధువు రాధికను మాత్రం ఫ్రెండ్స్ అందరూ ఆటపట్టించారు. ఆటలు, పాటలు, డ్యాన్స్ లతో ఈ పార్టీ అదరిపోయిందని తెలుస్తోంది. వధువు రాధికా కన్నా జాన్వీనే హైలైట్ గా కనిపించడం విశేషం. ఇక జాన్వీ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో ఆమె దేవర, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటిస్తోంది. మరి ఈ సినిమాలతో జాన్వీ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×