Big Stories

Supreme Court: కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సుప్రీం.. ‘ట్రయల్‌ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు..?’

Supreme court to Arvind kejriwal(Telugu news live): లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో భాగంగా తన అరెస్ట్, కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది.

- Advertisement -

లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారా? అంటూ సుప్రీంకోర్టు సీఎం తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీని ప్రశ్నించింది. తాము బెయిల్ కోసం ఎటువంటి పిటిషన్ దాఖలు చేయలేదని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది కోర్టులో వెల్లడించారు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది.

- Advertisement -

ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని, అందుకే తాము ట్రయల్ కోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని సీఎం తరఫు న్యాయవాది కోర్టుకు సమాధానం ఇచ్చారు. కేవలం ఈడీ సమన్లకు హాజరు కాలేదన్న కారణంతో సీఎంను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని తన వాదనలు వినిపించారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

Also Read: చిక్కుల్లో బీజేపీ, ఆ వీడియోల మాటేంటి?

ఈ కేసులో భాగంగా తీహార్ జైలులో ఉన్న తన భర్త సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలవడానికి అనుమతించడం లేదని అతని భార్య సునీత కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమె అభ్యర్థనను కోర్టు అనమతించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం మంత్రి ఆతిశీతో కలిసి సునీత కేజ్రీవాల్ తన భర్తను జైలులో కలుసుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో పనులు ఎలా జరుగుతున్నాయ్ అని కేజ్రీవాల్ తనని అడిగారని ఆతిశీ తెలిపారు. తాను తప్పుకుండా బయటకు వస్తానని, ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తానన్నారని ప్రజలకు హామీ ఇచ్చినట్లు ఆతిశీ వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News