BigTV English

Poonam Kaur: 2800 అమ్మాయిలను లైంగికంగా వేధించాడు.. అతనికి ఓటు వేయకండి

Poonam Kaur: 2800 అమ్మాయిలను లైంగికంగా వేధించాడు.. అతనికి ఓటు వేయకండి

Poonam Kaur: నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ సమయంలో అయితే ఈ భామ గురించి ఎవరు అంత పట్టించుకోరు కానీ , ఎన్నికల సమయంలో అమ్మడు ఏది మాట్లాడిన వైరల్ గా మారిపోతుంది. గత కొన్నిరోజులుగా పూనమ్ రాజకీయాల గురించి నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ రెండు తెలుగురాష్ట్రాలను హీట్ ఎక్కిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈసారి కర్ణాటక రాజకీయ నేతలపై ఫైర్ అయ్యింది. దేశం మొత్తం ఊపేస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలపై ఆమె ఒక వీడియో ద్వారా మాట్లాడింది.


మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు.. హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకరమైన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎంతోమంది అమ్మాయిలను అతడు బెదిరించి, లైంగికంగా వేధించినట్లు ఒక మహిళ పోలీస్ కేసు పెట్టడం, ఆ తరువాత ఈ వీడియోలు అన్ని బయటకు రావడం.. ప్రస్తుతం కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఘటనపై పూనమ్ ఫైర్ అయ్యింది. ఇలాంటివాడికా ఓటు వేసి గెలిపించేది అని ప్రశ్నించింది. 2800 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించిన ఈ ఎంపీ.. ఇప్పుడు జర్మనీ వెళ్లి దాక్కున్నాడు.. అతడిని తీసుకురాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఎంపీ ఇలా చేస్తే పట్టించుకోని ప్రభుత్వం రేపు మహిళలను ఎలా రక్షిస్తుందని, అతనికి డబ్బు, పలుకుబడి ఉండడంతోనే జర్మనీ పారిపోయినా తీసుకురావడం లేదని తెలిపింది.

ప్రజలు ఈ విషయమై నోరు మెదపకపోతే ఇలాంటి వారు ఎక్కువ అవుతారని, ప్రతి మహిళకు, ఆ మహిళలను గౌరవించే ప్రతి పురుషుడుకు తాను చెప్పేది ఒక్కటేనని.. ఇలాంటి ఆరోపణలు ఉన్నవారికి ఓట్లు వేసి గెలిపించకండి. మహిళలను దేవతులుగా పూజించే ఈ దేశంలో ఇలాంటివారికి ఓటు వేసి కుర్చీలో కుర్చోపెడదామా.. ? దయచేసి అతడికి ఓటు వేయకండి.. ఓటు.. ప్రతి పౌరుడి హక్కు. అలాంటి హక్కుతో ఇలాంటివారిని గెలిపించకండి. అన్యాయాన్ని అరికట్టేవారిని ఎంచుకోండి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×