BigTV English

Satire On Jagan Band Aid: జగన్ బ్యాండేజ్ పై రచ్చ రచ్చ.. !

Satire On Jagan Band Aid: జగన్ బ్యాండేజ్ పై రచ్చ రచ్చ.. !

YS Sunitha Sharmila Satire On Jagan Band Aid: జగన్ సొంత చెల్లెలు చీర గురించి వేలమంది జనం గురించి మాట్లాడి వివాదం రేపారు. దానిపై వైఎస్ షర్మిల సహా విపక్ష నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎన్నికల్లో షర్మిలను గెలిపించాలని ప్రచారం చేస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ షర్మిల. జగన్ తలకి పెట్టుకున్న బ్యాండ్ ఎయిడ్‌ను టచ్ చేసి కొత్త చర్చకు తెరలేపారు. గాలి తగిలితే గాయం త్వరగా మానిపోతుందని జగన్‌కి ఆ డాక్టర్ సలహా ఇస్తే ఎన్నికలయ్యేదాకా ఆయన కట్టు తీయరని టీడీపీ సెటైర్లు మొదలుపెట్టింది.


ఏపీ రాజకీయాలు రకరకాల చర్చలతో ఆసక్తికరంగా మారుతున్నాయి. సీఎం జగన్‌పై రాయిదాడి వ్యవహారం ఇప్పుడు కీలకంగా మారింది. ఆ దాడిలో జగన్‌తో పాటు వెల్లంపల్లి కంటికి కూడా తీవ్ర గాయమైందన్నారు. అయితే వెల్లంపల్లి కంటికి వేసిన బ్యాండేజ్‌పై పెద్ద రచ్చే నడిచింది. ఏ కంటికి దెబ్బతగిలిందో మర్చిపోయినట్లు వెల్లంపల్లి మార్చి మార్చి కట్టు కట్టించుకుంటున్నారని టీడీపీ విమర్శించింది. విమర్శలు రావడంతో చివరికి వెల్లంపల్లి కంటికి కట్టు మాయమైపోయిందని బోండా ఉమా దెబ్బిపొడిచారు.

ఇప్పుడు జగన్ వేసుకున్న బ్యాండెయిడ్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గాయం తగిలి ఇన్నాళ్లైన జగన్ బ్యాండెయిడ్ తీయకపోవడంపై.. వివేకా కూతురు, డాక్టర్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాండెయిడ్ ఎక్కువ రోజులు వేసుకుంటే సెప్టిక్ అవుతుందన్నారు. డాక్టర్‌గా చెబుతున్నా.. గాయానికి ఉన్న బ్యాండెయిడ్ తీసేయాలని సీఎం జగన్‌కు సలహా ఇచ్చారామె. గాయానికి గాలి తగిలితేనే త్వరగా మానిపోతుందని హితవు పలికారు.


ఇప్పటికే జగన్‌వి బ్యాండెయిడ్ డ్రామాలని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సునీత చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్ అయ్యాయి. నిజంగానే ఆమె జగన్ మంచికోరి చెప్పారా? సెటైరికల్‌గా చెప్పారా అనే దానిపై చర్చ సాగుతోంది. వాస్తవానికి ఈ నెల 13న సీఎం జగన్‌ నుదుటికి గులక రాయి తగిలింది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. మళ్లీ అదే రోజు రాత్రి విజయవాడ జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు.

Also Read: వైఎస్ పేటెంట్ నాదే! వారసుల వార్

ఆసుపత్రి లోపలికి వెళ్లేటప్పుడు గాయానికి చిన్న బ్యాండేజ్‌తో వెళ్లారు. బయటకొచ్చేటప్పుడూ చిన్న ప్లాస్టర్‌తోనే కనిపించారు. రెండు రోజుల తర్వాత అదే గాయంపై కొంచెం పెద్ద ప్లాస్టర్‌ వేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వేసుకుంటున్న ప్లాస్టర్‌ పరిమాణం కొద్ది కొద్దిగా పెరుగుతోందని..ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నాయి. ఎలక్షన్ అయ్యే వరకు జగన్ బ్యాండెయిడ్ తీయరంటూ నారా లోకేష్ సెటైరికల్ ట్వీట్ చేశారు. మొత్తమ్మీద జగన్ బ్యాండెయిట్ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×