Big Stories

AP Elections 2024: ఎన్నికల సినిమా..! టాలీవుడ్ చీలిందా?

- Advertisement -

గతంలో సినిమా నటుల చేత ఎన్నికల ప్రచారం చేయించేవి పార్టీలు. కానీ రాను రాను.. ఏకంగా సినిమా నటులే బరిలోకి దిగడం మొదలైంది. ఇలా సినిమాల్లో నటించి రాజకీయాల్లోకి వచ్చిన తొలి నేత ఎవరో మీక్ ఐడియా ఉందా? ఆయన పేరు కొంగర జగ్గయ్య.. 1967లో జరిగిన నాలుగో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. ఇక ఆ తర్వాత దాసరి, రావుగోపాల రావు.. కృష్ణ, కృష్ణంరాజు, జమున, కైకాల, మురళీ మోహన్, చిరంజీవి, హరికృష్ణ, రామానాయుడు, మోహన్‌బాబు, శారద, జయప్రద, విజయశాంతి..ఇలా చాలా పెద్ద లిస్ట్‌ ఉంది. వీరందరిలో ఎన్టీఆర్‌ది మాత్రం సపరేట్‌ రూట్..ఆయన ఏకంగా పార్టీ పెట్టి ప్రభంజనం సృష్టించారు. అధికారంలోకి వచ్చారు.. ఇక అప్పటి నుంచి ఏపీ పాలిటిక్స్‌లో సినిమా వాళ్ల ఇన్‌వాల్వ్‌మెంట్ మరింత పెరిగింది. ఈ ట్రెండ్‌ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఈసారి ప్రజలపై ఇలాంటి నటుల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్..

- Advertisement -

Also Read: జగన్ బ్యాండేజ్ పై రచ్చ రచ్చ.. !

కొన్ని రోజులు ముందు ఏపీ రాజకీయాల్లో సినీ ఇంపాక్ట్ క్రమంగా తగ్గుతోందనే భావన ఉండేది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ పెద్దగా పని చేయలేదు. మరి ఈసారి ఏ మేర పనిచేస్తుందన్నది చూడాలి. అయితే గతంలో లాగా ప్రజల ముందుకు వచ్చి మాత్రం ఇండస్ట్రీ పెద్దలు ఎక్కువగా హడావుడి చేయడం లేదు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియదు. ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న టెన్షన్‌తోనే సినీ ప్రముఖులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే కొందరు సినీ పరిశ్రమకు చెందిన వారిలో కొందరు టీడీపీ, జనసేన కూటమికి బహిరంగంగానే మద్దతు ఇస్తుంటే. ఇంకొందరు మాత్రం వైసీపీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ రెండు పార్టీల వైపు చీలిపోయి కనిపిస్తోంది. అయితే ఆ చీలిక బయటకు కనిపించడం లేదు. బాహా బాహీ అన్నట్లు లేదు. పెద్దగా సినీ ప్రముఖులు ఎవరూ పొలిటికల్ ప్రచారాల్లో కనిపించడం లేదు కూడా.

అయితే ఇప్పటికే ఎన్డీఏ కూటమికి మెగాస్టార్ చిరంజీవి జై కొట్టారు. తమ్ముడు పవన్‌ కల్యాణ్‌తో పాటు బీజేపీ నేతలకు మద్దతు ఇస్తున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. చిరు బాటలోనే ఆయన కుటుంబ సభ్యులతో పాటు జబర్దస్త్‌ టీమ్‌లోని కొందరు నటులు కూడా ఉన్నారు. పవన్‌కు మద్ధతుగా వీరంతా ప్రచారాలు, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు మద్దతు ప్రకటించారు. మరో ప్రముఖ నిర్మాత, రచయిత కోన వెంకట్ జగన్ ప్రభుత్వాన్ని భేష్ అంటున్నారు. పోసాని వైసీపీకి అనుకూలంగా దుమ్ము దులుపుతున్నారు. పృథ్వీ జనసేన క్యాంప్‌లో చేరారు. వైసీపీలోనే ఉన్న అలీ ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఇటీవల ప్రచారంలో పవన్ కల్యాణ్‌.. సూపర్ స్టార్ కృష్ణను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై చాలా కాంట్రవర్సీ నడిచింది. అయితే దీనిపై ఇండస్ట్రీ నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు. దీనిపై మహేష్‌బాబు కూడా మౌనంగానే ఉన్నారు. కానీ నరేష్‌ మాత్రం చురకలు అంటించారు. ఇక అక్కినేని నాగార్జున కుటుంబం కూడా మౌనంగానే ఉంది. సో ఓవరాల్‌గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో.. తెలుగు సినిమా పరిశ్రమ చీలికలు పేలికలుగా మారింది. ఎన్నికల విషయంలో ఏకతాటిపై ఉండకున్నా.. న్యూట్రల్‌గా ఉండాల్సిన సినీ పెద్దలు ఎవరి దారిలో వారు ఉన్నారని అర్థమవుతుంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో వీరంతా సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఏపీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి మాత్రం సీన్‌ మొత్తం మారిపోయింది.

Also Read: వైసీపీ కి గొట్టిపాటి గట్టి షాక్!

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్‌ టాపిక్ రావడం రోటీన్‌గా మారింది. 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం చేయాల్సిందంతా చేశారు ఎన్టీఆర్.. బట్ ఆ ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాల విషయంలో ఆయన ఆలోచన మారినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు.. ప్రచారానికి కూడా రాలేదు. ఈసారి కూడా ఆయన ప్రచారానికి దూరంగానే ఉన్నారు. కానీ తారక్ ఫ్రెండ్స్‌గా చెప్పుకునే కొడాలి నాని, వల్లభనేని వంశీ అనుచర వర్గాలు మాత్రం తారక్‌ మద్ధతు తమ నేతలకే ఉందని ప్రచారం చేసుకుంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ సినిమా నుంచి వచ్చినవారే కావడంతో ఇప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీనికి తోడు టీడీపీ బాలకృష్ణ, నారా రోహిత్‌తో పాటు పలువురు నిర్మాతలు కూడా పార్టీకి అండదండలు అందిస్తున్నారు. ఎట్‌ ది సేమ్ టైమ్.. రోజా కూడా సినిమాల నుంచి వచ్చినవారే..ఇండస్ట్రీలోని ఓ వర్గం కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. అయితే ఇండస్ట్రీలో కొందరిని మినహాయించి.. చాలా మంది టీడీపీ,జనసేనతో టచ్‌లో ఉన్నారని మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News