E-Paper
Advertisement

Chandrababu: సైకో జగన్‌కు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలి: చంద్రబాబు

Chandrababu: సైకో జగన్‌కు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలి: చంద్రబాబు
Advertisement

Chandrababu: అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు రూ.4,000 ఫించన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. డోన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు జగన్‌ తీరుపై ధ్వజమెత్తారు.

కూటవి అధికారంలోకి వచ్చాక అందరికీ ఇళ్లస్థలాలతో పాటు గృహాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి బుగ్గనను అప్పుల మంత్రిగా అభివర్ణించిన చంద్రబాబు ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. రాయలసీమలో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి నీరు అందిస్తామని బాబు హామీ ఇచ్చారు.

Advertisement

ప్రజల భూములను జగన్ తన పేరున రాసుకుంటున్నారని విమర్శించారు. పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ తన ఫొటో పెట్టుకున్నారని అన్నారు. ఇటీవలే ఓ చేనేతకారుడు తన భూములను ఇతరులు పేరిట మార్చారంటూ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను అడ్డగోలుగా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

జగన్ తన పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేశారని, రైతుల మెడలు నొక్కడంతో వారు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలో వస్తే రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చుతామని చంద్రబాబు మాటిచ్చారు.

Advertisement

రాయలసీమకు వైసీపీ నాయకులు ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా?, రోడ్లు వేశారా?, పరిశ్రమలు తెచ్చారా?.. ఏమీ చేయని నాయకులకు ఎందుకు ఓట్లు వేయాలన్నారు. పార్టీ రంగుల పేరుతో వందల కోట్లు ఖర్చు చేసిన సైకో జగన్ కు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలని చంద్రబాబు అన్నారు.

Also Read: ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం సీరియస్.. జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ

మహాశక్తి కింద 4 కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళల నిధి కింద నెలకు రూ.1,500 అందిస్తామన్నారు. దీంతో పాటుగా వృద్ధులకు రూ.4,000 ఫించన్ ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తామన్నారు.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×