Big Stories

Belly fat: పసుపుతో బెల్లీ ఫ్యాట్ కు చెక్ పెట్టండిలా..!

Turmeric For Reducing Belly Fat: నేటి తరం ఎదుర్కుంటున్న సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ ఒకటి. అయితే శారీరక శ్రమ తగ్గి గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు పెరగడం వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. దీని వల్ల తరచూ అనారోగ్యానికి గురై ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

- Advertisement -

అయితే కొందరు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి మార్కెట్లో లభించే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీటి వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడం పక్కన పెడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కానీ వంట గదిలో లభించే పసుపును వాడడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఏ విధంగా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

పసుపులో ఉండే ప్రధాన మూలకం కర్కుమిన్ అయితే ఇందులో ఉన్న యాంటీ ఇన్ ఫ్లమేటరీ జీవక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ అంశం పరిశోధనల్లో కూడా రుజువైంది. అధిక బరువుతో బాధపడేవారికి ఇది మంచి ఫలితాన్నిస్తుంది. బరువు తగ్గే ప్రక్రియను సులభం చేస్తుందని చెప్పొచ్చు. శరీరంలోని జీవక్రియలు ఎంత వేగంగా జరిగితే అంత ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలో జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీని ద్వారా శరీరంలోని కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది.

పసుపు నీరు : ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పసుపు పొడి, కాస్త నిమ్మరసం వేసుకుని ఈ నీటిని రోజూ పరగడుపున తాగాలి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

పసుపు పాలు: వేడిపాలలో కాస్త పసుపు పొడి కొద్దిగా దాల్చిన చెక్క పొడిని వేసి తాగాలి. ఇలా చేస్తే బరువు తగ్గడమే కాకుండా హాయిగా నిద్ర పడుతుంది.

ఆహారంలో పసుపు: తినే ఆహార పదార్థాల్లో పసుపును క్రమం తప్పకుండా వాడాలి. దీని వల్ల రుచి పెరగడమే కాకుండా బరువు తగ్గుతుంది.

ప్రతి రోజు ఉదయాన్నే పసుపు నీరు తాగితే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. కడుపు ఉబ్బరం సమస్య దరిచేరదు. పసుపు నీరు తాగడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండెపోటు వచ్చే రిస్క్ దీని ద్వారా తగ్గుతుంది.

Also Read: మండుటెండలతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు డేంజర్.. వైద్యుల సూచనలు

పసుపు నీరు వాపును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పిని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుభ్రపరచడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా మెరిసే చర్మం సొంతమవుతుంది. క్రమం తప్పకుండా పసుపు నీటిని తాగడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News