Big Stories

Sugar Patients in Summer: మండుటెండలతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు డేంజర్.. వైద్యుల సూచనలు

Summer Effect on Diabetic Patients: మండుటెండలు ఊపిరాడకుండా, కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగలు, రాత్రి విపరీతమైన వేడి కారణంగా.. ఉక్కపోత పెరిగింది. చిగురాకైనా ఊగక.. చిన్న కునుకు కూడా పట్టడం లేదు. రూమ్ టెంపరేచర్స్ కూడా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను తాకాయి. మరో నాలుగైదు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని, పనులుంటే త్వరగా ముగించుకోవాలని సూచించింది.

- Advertisement -

వేసవికాలంలో బయటికెళ్తే నీరసం రావడం ఖాయం. వడదెబ్బ తగిలిందంటే.. మూడు నాలుగు రోజుల వరకూ కోలుకోరు. పండ్లరసాలు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తరచూ తాగుతుండాలని చెబుతారు వైద్యులు. అయితే.. అధిక ఉష్ణోగ్రతలు మధుమేహ వ్యాధి గ్రస్తులపై ప్రభావం చూపుతాయని వైద్యులు తెలిపారు. మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా ఉన్నవారికంగా షుగర్ వ్యాధిగ్రస్తులు త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతారని చెబుతున్నారు.

- Advertisement -

అధిక ఉష్ణోగ్రతల వల్ల అలసట పెరుగుతుంది. శరీరంలో నీటిశాతం తగ్గి మూత్రవిసర్జన తగ్గిపోతుంది. తరచూ తలనొప్పి, తల తిరగడం, నోరు,కళ్లు పొడిబారడం వంటి లక్షణాలతో పాటు.. గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. ఫలితంగా కిడ్నీ, గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది.

Also Read: హార్మోన్ల సమస్యా..? ఈ ఫుడ్స్ తో బ్యాలెన్స్ చేసుకోండి

షుగర్ పేషంట్లు రోజుకు కనీసం 4-5 లీటర్లు నీరు తాగాలి. అలాగే కూల్ డ్రింక్స్, ఇతర శీతల పానీయాలకు, ఆల్కహాల్ కు కచ్చితంగా దూరంగా ఉండాలి. బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరగకుండా చూసుకోవాలి. వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ తినాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తుండాలి అని వైద్య నిపుణులు సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News