BigTV English

Jabardasth Faima: తల్లిదండ్రులు లేరని సింపతీ.. ప్రవీణ్ కు నాకు ఎలాంటి రిలేషన్ లేదు

Jabardasth Faima: తల్లిదండ్రులు లేరని సింపతీ.. ప్రవీణ్ కు నాకు ఎలాంటి రిలేషన్ లేదు

Jabardasth Faima: పటాస్ అనే షో ద్వారా పరిచయమై పటాస్ ఫైమా గా పేరు తెచ్చుకుంది ఫైమా. ఇక ఆ తరువాత జబర్దస్త్ కు వచ్చి తన సత్తా చూపించి ఆనతి కాలంలోనే స్టార్ కమెడియన్ గా మారింది. ఇక బిగ్ బాస్ తరువాత అమ్మడు మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఏ ఆర్టిస్ట్ జీవితంలోనైనా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వేరు ఉంటుంది.. ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ వేరు ఉంటుంది. జబర్దస్త్ లో ఫైమాకు సైతం ప్రవీణ్ జత కలిపారు. వీరిద్దరూ జంటగా కామెడీ పండిస్తుంటే వర్క్ అవుట్ అవుతుందని ఎక్కువ షోస్ లలో రియల్ జంటగా చూపించారు. అయితే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బయట కూడా కొనసాగిందని టాక్. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి.


బిగ్ బాస్ స్టేజి మీద ప్రవీణ్ సైతం ఫైమాకు తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక.. వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఏమైంది అనేది ఇద్దరు నోరు విప్పలేదు. హౌస్ నుంచి వచ్చాక ఫైమా మారిపోయిందని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. కానీ, ఇప్పటివరకు ప్రవీణ్ వ్యాఖ్యలపై ఫైమా స్పందించింది లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయమై మాట్లాడింది. తమ మధ్య ప్రేమ లాంటిది ఏది లేదని, దయచేసి తమ రిలేషన్ కు పేరు పెట్టవద్దని చెప్పుకొచ్చింది.

” షోస్ లలో కనిపించే జంటలేవి నిజాలు కాదు. కేవలం టిఆర్పి కోసమే జంటలుగా నటిస్తున్నారు. ప్రవీణ్, నేను కూడా అంతే. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బావుందని మేము బయట యూట్యూబ్ లో వీడియోలు తీసాం అంతే. ఇక మా ఇద్దరి మధ్య చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. అందుకే మేము విడిపోయాం. ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ నేనెప్పుడూ మీడియా ముందు చెప్పాలనుకోలేదు.


ఈ గొడవను ఇంకా పెద్దది చేయడం కూడా నాకిష్టం లేదు. ఏదైనా ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. కానీ, ప్రవీణ్ అందరి ముందు నన్ను నెగటివ్ చేసి మాట్లాడుతున్నాడు. అతనికి తల్లిదండ్రులు లేకపోవడంతో ఏం మాట్లాడినా సింపతీ క్రియేట్ అవుతుంది. దీనివలన అందరూ నన్ను నెగటివ్ అన్నట్లు చూస్తున్నారు. దయచేసి మా రిలేషన్ కు ఏ పేరు పెట్టకండి.. మా మధ్య ఏం లేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఫైమా ఒకపక్క జబర్దస్త్.. ఇంకోపక్క షోస్ తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది.

Related News

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Big Stories

×