Big Stories

Beauty Tips: ముఖానికి ఫౌండేషన్ అప్లై చేస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే !

Side Effects Of Regular Foundation Use: అందంగా కనిపించడం కోసం చాలా మంది మేకప్ వేసుకుంటారు. సాధారణంగా మేకప్ వేసుకోవడానికి ముందు ముఖంపై ఫౌండేషన్ క్రీమ్ రాస్తారు. వారి వారి చర్మం రంగు, రకాన్ని బట్టి ఫౌండేషన్ ఎంపిక చేసుకోవాలి. నాణ్యత లేని ఫౌండేషన్ అప్లై చేయడం వల్ల చాలా హాని కలుగుతుంది.

- Advertisement -

ఫౌండేషన్ వాడే వారు వారి చర్మానికి సరిపోయే ఉత్పత్తులను ఎంపిక చేసుకోవడం ఎంతైనా అవసరం.  ఫౌండేషన్ నాణ్యత లేకుంటే అలాంటి ప్రాడక్ట్స్ చర్మానికి హాని కలిగిస్తాయి. ముఖానికి ఫౌండేషన్‌ తరుచూ అప్లై చేయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది మొటిమలు పెరగడానికి కారణమవుతుంది. ఫౌండేషన్ వాడిన రోజు రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకోకపోతే..చర్మం లోపలి పొరలో ఉన్న దుమ్ము, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోతాయి. దీని వల్ల మొటిమలు, వైట్ హెడ్స్ వస్తాయి. అందుకే ఫౌండేషన్ అప్లై చేయడానికి ముందు ఆ తర్వాత చర్మాన్ని శుభ్రం చేయాలి.

- Advertisement -

Also Read: మెరిసే ముఖం కోసం.. ఈ ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి !

నాణ్యత లేని ఫౌండేషన్‌ ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. దురద, వాపు లేదా దద్దుర్ల లాంటి సమస్యలు వస్తాయి. అందుకే హైపో అలెర్జెనిక్ ఫౌండేషన్లను మాత్రమే ఉపయోగించాలి. ఏదైనా మేకప్ ప్రాడక్ట్‌ని ముఖానికి అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.

నాణ్యత లేని ఫౌండేషన్‌ ల వల్ల చర్మం పొడిబారడమే కాకుండా మెరుపును కోల్పోతుంది. అలాంటి సందర్భంలో హైడ్రేటింగ్ ఫౌండేషన్ వాడాలి. పలు రకాల పౌండేషన్ లు చర్మ కణాలను దెబ్బతీస్తాయి. దీని కారణంగా ముడతలు, మచ్చలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ చర్మానికి ఏ ఫౌండేషన్ సరిపోతుందో స్కిన్ స్పెషలిస్ట్ లేదా మేకప్ ఆర్టిస్ట్ ను అడిగి సలహా తీసుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News