Lallu Prasad’s Son Tej Pratap Pushed Party Leaders on Stage: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ సహనాన్ని కోల్పోయారు. స్టేజ్ పైన ఉన్న సొంత పార్టీ కార్యకర్తను క్రిందకు తోసేసాడు. మీసా భారతి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది.
పాటలిపుత్ర లోక్ సభ స్థానం కోసం లాలూ కుమార్తె మీసా భారతి నామినేషన్ వేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో తేజ్ ప్రతాప్ పాల్గొన్నారు. అప్పుడు ఓ కార్యకర్త తేజ్ ప్రతాప్ దగ్గరకు వచ్చి హంగామా చేశాడు. దీంతో ప్రతాప్ ఆ కార్యకర్తను తోసేసాడు. స్టేజ్ పైన ఉన్న ఇతర కార్యకర్తలు అతడిని సముదాయించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజ్ ప్రతాప్ ప్రవర్తను పలువురు తప్పుబడుతున్నారు.
బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ పై మీసా భారతి పోటీ చేస్తున్నారు. జూన్ 1న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో రామ్ కృపాల్ యాదవ్ చేతిలో మీసా భారతి ఓడిపోయారు.
Also Read: గురుద్వారకు మోదీ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
This video is from the nomination rally of Lalu Yadav's daughter Misa Bharti.
You can see how Lalu's son Tej Pratap Yadav is assaulting one of his own party workers.Any comment @ravishndtv ?? pic.twitter.com/5jL9dbBtkc
— Mr Sinha (@MrSinha_) May 13, 2024